క్రైమ్/లీగల్

నౌహీరా షేక్ విడుదల.. వెంటనే అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్, అక్టోబర్ 26: దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరా గ్రూప్ కంపెనీ సీఈఓ నౌహీరా షేక్ విడుదల అయిన వెనువెంటనే మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. హీరాగ్రూప్ కుంభకోణం కేసులో అరెస్టయి చంచల్‌గూడ మహిళా కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న నౌహీరాషేక్‌కు బుధవారమే న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గురువారం బెయిల్ పత్రాలు చంచల్‌గూడా జైలుకు సకాలంలో అందకపోవడంతో విడుదల కాలేదు. శుక్రవారం ఉదయం నౌహీరా షేక్‌ను చంచల్‌గూడా జైలు నుంచి విడుదల చేసారు. రెండు రోజులుగా ఆమె కోసం కాచుకొని ఉన్న మహారాష్ట్ర పోలీసులు ప్రిజనర్స్ ట్రాన్సిట్(పీటీ) వారెంట్‌పై ఆమెను అరెస్టు చేసారు.