క్రైమ్/లీగల్

చత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ మెరుపు పంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, అక్టోబర్ 27: చత్తీస్‌గఢ్‌లో ఈసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. శనివారం మావోయిస్టులు జరిపిన దాడిలో ఐదుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా బలగాల విస్తృత కూంబింగ్‌లు, వరస ఎన్‌కౌంటర్లతో ఇటీవల కాలంలో భారీగా నష్టం చవిచూసిన మావోయిస్టులు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అదును చూసి సీఆర్‌పీఎఫ్ బలగాలపై దాడి చేశారు. మరో 15 రోజుల్లో శాసనసభ తొలి విడత ఎన్నికలు జరగనున్న వేళ భద్రతా బలగాలపై మావోయిస్టులు పంజా విసరడం సంచలనం కలిగించింది. మావోల దాడిలో గాయపడిన జవాన్‌ను వెంటనే బీజాపూర్‌కు, అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు హెలికాప్టర్‌లో రాయపూర్ తరలించారు. మృతుల్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్లు ఉన్నారు. ఈ ఘటనను యాంటీ మావోయిస్టు ఆపరేషన్స్ డీఐజీ సుందర్‌రాజ్ ధ్రువీకరించారు. బీజాపూర్ జిల్లా ఆవుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహించిన అనంతరం సీఆర్‌పీఎఫ్ 168 బెటాలియన్‌కు ఏడుగురు జవాన్లు మైన్‌ప్రూఫ్ వాహనంలో తిరిగి వస్తున్నారు. శనివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ముర్దొండ గ్రామ సమీపంలో మాటు వేసిన మావోయిస్టులు అదును చూసి జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని శక్తివంతమైన ఐఈడీ మందుపాతర పేల్చారు. మందుపాతర ధాటికి వాహనం తునాతునకలు కాగా, చెల్లాచెదురైన జవాన్లపై కాల్పులు జరిపారు. గాయపడిన జవాన్లు తేరుకొని ఎదురుకాల్పులు ప్రారంభించడంతో మావోయిస్టులు పరారయ్యారు. ఈ దాడిలో ఒక ఏఎస్సై, ఒక హెడ్ కానిస్టేబుల్ సహా మరో ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలుకాగా వారిని బీజాపూర్ తరలించారు. ఈ క్రమంలో మరో కానిస్టేబుల్ మృతి చెందాడు. మృతి చెందిన వారిలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన 168 బెటాలియన్ ఏఎస్సై మైతూరు రెహ్మాన్ (50), ఒడిషాకు చెందిన హెడ్ కానిస్టేబుల్ బీఎం బెహరా (43), ఆంధ్రాకు చెందిన
సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ సీహెచ్ ప్రవీణ్ (21), ఆంధ్రాకే చెందిన మరో కానిస్టేబుల్ జి.శ్రీను (26) ఉన్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు జవాన్లను బీజాపూర్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మరో జవాన్ మృతి చెందాడు. ఇతని వివరాలు తెలియరాలేదు. దాడి అనంతరం మావోయిస్టులు సమీప అడవుల్లోకి వెళ్లిపోయారు. దాడి సమాచారం తెలియగానే బలగాలు ఘటనా స్థలికి చేరుకుని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. మందుపాతరను తట్టుకునే వాహనంలో బయలుదేరినా వారు మావోయిస్టుల దాడి నుంచి తప్పించుకోలేక పోయారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతుందని డీఐజీ పి.సుందర్‌రాజ్ తెలిపారు. సంఘటన స్థలికి అదనపు బలగాలను పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు. వరస ఎదురు దెబ్బలతో ప్రతీకారేచ్ఛతో ఉన్న మావోయిస్టులు ఎన్నికల వేళ బలగాల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ఈ దాడి జరిపినట్లు భావిస్తున్నారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ ప్రవీణ్‌ది ప్రకాశం జిల్లా రాచర్ల పోలీసు స్టేషన్ పరిధిలోని గౌతవరం కాగా, మరో జవాన్ గుల్లిపల్లి శ్రీనుది విజయనగరం జిల్లా అట్లవరం.

చిత్రాలు.. ..మావోయిస్టుల దాడిలో గాయపడిన జవాన్‌ను తరలిస్తున్న పోలీసులు
*పేలుడుకు తునాతునకలైన మైన్‌ప్రూఫ్ వాహనంపేలుడుకు తునాతునకలైన మైన్‌ప్రూఫ్ వాహనం