క్రైమ్/లీగల్

టాస్క్ఫోర్స్‌పై స్మగ్లర్ల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 27: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో శనివారం టాస్క్ఫోర్స్ సిబ్బందిపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడి చేశారు. తమ వద్ద ఉన్న కత్తులు, గొడ్డళ్లనే కాకుండా రాళ్లు విసరడంతో ఎఫ్‌బిఓ కోదండ తలకు గాయమైంది. అయినప్పటికీ టాస్క్ఫోర్స్ సిబ్బంది తమిళనాడు, విల్లుపురం జిల్లాకు చెందిన నలుగురు స్మగ్లర్లను పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 25 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం తెల్లవారు జామున చంద్రగిరి మండలం పుల్లయ్యగారి పల్లి అటవీప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. టాస్క్ఫోర్స్ ఆర్‌ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి శుక్రవారం అర్థరాత్రి సమయంలో కల్యాణిడ్యాం వద్ద కూంబింగ్ చేస్తుండగా రంగంపేట రేంజ్ భీమవరం సమీపంలో స్మగ్లర్ల అడుగుజాడలను గుర్తించి అక్కడ మాటు వేశారు. అదే సమయంలో దాదాపు 30 మంది స్మగ్లర్లు ఎర్రచందనం చెట్లను నరికి తీసుకురావడాన్ని గమనించి వారిలో నలుగుర్ని టాస్క్ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. మిగిలిన వారు తప్పించుకుని టాస్క్ఫోర్స్ సిబ్బందిపై రాళ్లు, కత్తులు, గొడ్డలు విసిరారు. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో టాస్క్ఫోర్స్ సిబ్బంది రెండు రౌండ్లు
గాలిలోకి కాల్పులు జరిపడంతో స్మగ్లర్లు అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయారు. సంఘటనా స్థలంలో పడివున్న 23 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో తమిళనాడు విల్లిపురం జిల్లాకు చెందిన పొన్నువేలు, కుమార్, శక్తివేలు, చిన్నరాజులు ఉన్నారు. వీరిలో ఓ స్మగ్లర్ కాలు బెనకడంతో అతనిని, గాయపడ్డ ఎఫ్‌బిఓ కోదండంను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈసందర్భంగా ఏఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎర్రచందనం స్మగ్లింగ్ నివారణకు నిఘాను పెంచి స్మగ్లర్లను ఎక్కడికక్కడ పట్టుకోగలుగుతున్నామన్నారు. ప్రజలు కూడా సహకరించి స్మగ్లర్ల సమాచారాన్ని తెలియజేయాలన్నారు. వారికి ఎలాం సహాయం అందించవద్దని విజ్ఞప్తి చేశారు.