క్రైమ్/లీగల్

అదృశ్యమైన విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్టూరు, అక్టోబర్ 27: తండ్రి మందలించాడని మూడు రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మార్టూరు మండలం వలపర్ల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి అంజిరెడ్డి తన కుమారుడైన హర్షవర్థన్‌రెడ్డి(16) వరపర్ల ఎం ఎస్ ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం కళాశాలకు వచ్చి సినిమాకి వెళ్లాడు. కళాశాలకు వెళ్లకుండా సినిమాకి వెళ్లాడని తల్లిదండ్రులకు తెలిస్తే మందలిస్తారని భయాందోళనలో కళాశాలలో పుస్తకాల సంచి వదిలేసి ఒంగోలు వెళ్లాడు. మూడు రోజుల నుంచి ఇంటికి రాకపోడంతో శుక్రవారం అదృశ్య కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టడంతో ఒంగోలు రైలు పట్టాల సమీపంలో గుర్తు తెలియని శవంగా పడి ఉండడాన్ని గుర్తించి ఒంగోలు పోలీసులు, మార్టూరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. అదృశ్య కేసు నమోదైన విద్యార్థి హర్షవర్ధన్‌రెడ్డి శవంగా గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఒంగోలురిమ్స్‌లో పోస్టుమార్టం నిమిత్తం హర్షవర్ధన్‌రెడ్డి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.

ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య
పంగులూరు, అక్టోబర్ 27: మండలంలోని కశ్యాపురం ఎస్సీకాలనీలో శనివారం సాయంత్రం ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. రేణింగవరం ఎస్సై అజయ్‌కుమార్ అందించిన ప్రాథమిక సమాచారం మేరకు కశ్యాపురం ఎస్సీకాలనీకి చెందిన తెలగతోటి జడ్సన్‌బాబు(30) శనివారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియ రాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

అల్లుడిని కత్తితో పొడిచిన మామ
మర్రిపూడి, అక్టోబర్ 27 : మండలంలోని నిర్మాపురం గ్రామానికి చెందిన పోకల రాజశేఖర్ (35) అనే వ్యక్తిని కుటుంబ తగాదాల నేపధ్యంలో శనివారం ఘర్షణ పడి క్షతగాత్రుడి మేమమామ ముత్తుమల కాశిరెడ్డి బరిశతో దాడి చేయడంతో రాజశేఖర్‌కు బలమైన గాయాలైన సంఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే క్షతగాత్రుడ్ని వైద్య చికిత్స నిమిత్తం పొదిలి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్న నేపధ్యంలో మార్గమధ్యలోనే మృతి చెందినట్లు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మర్రిపూడి ఎఎస్‌ఐ మహబూబ్‌బాషా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పొదిలి సీఐ శ్రీనివాసరావు పర్యవేక్షణలో కేసు పూర్వాపరాలను తెలుసుకున్నట్లు ఎఎస్‌ఐ తెలిపారు. రెండు కుటుంబాల మధ్య భూవివాదంలో ఘర్షణ పడినట్లు తెలిసింది. మృతుడు రాజశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన స్వగ్రామమైన నిర్మాపురం గ్రామానికి పరిశీలించారు. నిందితుడు కాశిరెడ్డి పరారీలో ఉండటంతో నిందితుని కోసం గాలిస్తున్నట్లు ఎఎస్‌ఐ తెలిపారు.