క్రైమ్/లీగల్

దొంగనోట్ల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంథని, అక్టోబర్ 27: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నుండి తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి దొంగనోట్లను తరలిస్తున్న ముఠా శనివారం స్టాటిక్ సర్వేలెన్స్ టీంకు పట్టుబడింది. మంథని మండలంలోని ఎక్లాస్‌పూర్‌లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేస్తుండగా ద్విచక్ర వాహనంపై గుంటూరు జిల్లా తాడిపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన షేక్ మస్తాన్‌తో పాటు వరంగల్ జిల్లా శాయంపేటకు చెందిన పోడిశెట్టి కృష్ణముర్తి, ములుగుకు చెందిన ఆకుల శంకర్‌లు నకిలీ నోట్లను వరంగల్ నుండి గోదావరిఖనికి ద్విచక్రవాహనంపై తీసుకెళ్తుండగా మంథని మండలం ఎక్లాస్‌పూర్ చెక్‌పోస్టు వద్ద ఉదయం నాలుగు గంటలకు పట్టుపడ్డారు. వీరి వద్ద 500 నోట్ల కట్టలు 158 లభించాయని అందులో ప్రతి కట్టకు పైన కిందా మాత్రమే అసలు నోట్లను పెట్టి లోపల మాత్రం అన్ని నకిలీ నోట్లను పెట్టి తరలిస్తున్నారని గోదావరిఖని ఏసీపీ రక్షిత తెలిపారు. అందులో అసలు నోట్లు 24 వేలు ఉండగా మిగతా రూ.79 లక్షలు నకిలీ నోట్లని పేర్కొన్నారు. వరంగల్ నుండి ద్విచక్రవాహనం మీదుగా తీసుకెళ్తున్న ఈ దొంగనోట్లను ఎవరికి ఇవ్వడానికి తీసుకెళ్తున్నారో విచారణ చేసి తదుపరి వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ తెలిపారు. ఎలక్షన్ కమీషనర్ ఆదేశాలతో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి ప్రతి వాహనాన్ని క్షుణంగా పరిశీలిస్తున్నామని దీనికి అందరు సహకరించాలన్నారు. ఆమె వెంట మంథని ఇన్‌చార్జి తహశీల్దార్ రాజేష్, మంథని సిఐ నటేష్, మంథని, రామగిరి ఎస్సైలు మహేందర్, సత్యనారాయణ, స్టాటిక్ సర్వేలెన్స్ టీం సభ్యులు శ్రీకాంత్, రత్నంలను ఏసీపీ అభినందించారు.
మంథనిలో రూ.10 లక్షలు పట్టివేత
అలాగే మంథని నుండి కాటారం తీసుకెళ్తున్న రూ.10 లక్షలను పట్టుకున్నామని అవి పోస్టాఫీసుకు చెందినవిగా తీసుకెళ్తున్న వారు చెప్పడంతో వాటి పత్రాలను పరిశీలించిన అనంతరం వారికి అప్పచెప్తామన్నారు.

చిత్రం..నకిలీ నోట్లను మీడియా ఎదుట ప్రదర్శిస్తున్న గోదావరిఖని ఏసీపీ రక్షిత