S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/26/2019 - 00:56

రాజమహేంద్రవరం, జూన్ 25: రాజధాని అమరావతిలో కృష్ణా కరకట్టపై ప్రభుత్వ నిర్మాణం ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమవుతున్న అక్రమ నిర్మాణాల తొలగింపు వ్యవహారం గోదావరి నది ఒడిలో అక్రమార్కులకు గుబులురేపుతోంది.

06/26/2019 - 00:50

విజయవాడ, జూన్ 25: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉండవల్లిలోని ప్రజావేదికను కూల్చివేసే ప్రక్రియను సీఆర్‌డీఏ అధికారులు మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. జేసీబీలను, కూలీలను ప్రజావేదిక ప్రాంగణంలోకి తరలించారు. ఈ కూల్చివేతపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.

06/26/2019 - 00:48

అక్టోబర్ నాటికి బెల్టుషాపులు ఉండకూడదు

06/26/2019 - 00:46

విజయవాడ: విశాఖ గిరిజన ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలు చేసేందుకు గత ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఉండవల్లి ప్రజావేదికలో రెండో రోజు జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో భాగంగా మంగళవారం ఆయన పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు వద్దన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలు జరపడంలో అర్థం లేదన్నారు.

06/26/2019 - 00:42

విజయవాడ, జూన్ 25: అవినీతి రహిత, పారదర్శక పాలన కోసం ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ముఖ్యమంత్రి ఇంటి వద్దే ఇసుక లూఠీ చేశారని, మహిళా ఎమ్మార్వోను జుట్టుపట్టుకుని లాగిపడేశారని, గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్ మన కళ్ల ఎదుటే జరిగిందని గుర్తు చేశారు. కాల్ మనీ పేరిట మహిళలకు వేధింపులు, థియేటర్ ఓనర్ల నుంచి ఎమ్మెల్యేలు డబ్బుల వసూలు వంటివి చేశారన్నారు.

06/25/2019 - 04:55

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు ఆదాయం వైపు దృష్టిపెట్టారు. జోన్‌ను ఆర్థికంగా ముందుకు తీసుకుపోవడానికి అనుభవం ఉన్న అధికారులను ఆయా విభాగాలకు అధిపతులుగా నియమించింది.

06/25/2019 - 04:16

హైదరాబాద్, జూన్ 24: నీట్ ర్యాంకు ద్వారా జాతీయ పూల్‌లో మెడికల్, డెంటల్ అడ్మిషన్ల తొలి దశ కౌనె్సలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 24వ తేదీ సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. అన్ని రాష్ట్రాల్లో 15 శాతం సీట్లతో పాటు డీమ్డ్ వర్శిటీల్లో మెడికల్ అడ్మిషన్లను కూడా ఎంసీసీ చేపట్టింది. నీట్‌లో దేశవ్యాప్తంగా 15.19 లక్షల మంది రాస్తే 7 లక్షల 97వేల మంది అర్హత సాధించారు.

06/25/2019 - 04:15

హైదరాబాద్, జూన్ 24: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు 54 వీక్లీ ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య 28 రైళ్ళు, తిరుపతి - విశాఖపట్నం మధ్య 28 ప్రత్యేక రైళ్ళను నడుపుతున్నారు. సికింద్రాబాద్ నుంచి విశాఖ మధ్య నడిచే రైళ్ళు రాయనపాడు మీదుగా నడుస్తాయి.

06/25/2019 - 03:58

హైదరాబాద్, జూన్ 24: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 28న హైదరాబాద్‌లో సమావేశం కానున్నారని సమాచారం. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై చర్చించడానికి వీరు ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నారని తెలిసింది. ఈ నెల 27న కొత్త సచివాలయం, శాసనసభ సముదాయ భవనాలకు భూమి పూజ జరుగనుంది.

06/25/2019 - 01:22

హైదరాబాద్: తెలంగాణలో ఎమ్సెట్ కౌనె్సలింగ్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. తొలి రోజు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి 23,715 మంది స్లాట్‌లను బుక్ చేసుకున్నారు. మిగిలిన వారు సైతం తమ స్లాట్‌లను టీఎస్‌ఎమ్సెట్ డాట్ ఎన్‌ఐసీ డాట్ ఇన్ అనే వెబ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని కన్వీనర్ నవీన్ మిట్టల్ చెప్పారు. సర్ట్ఫికేట్ల పరిశీలన 27వ తేదీ నుండి మొదలవుతుంది. జూలై 3 వరకూ సర్ట్ఫికేట్ల పరిశీలన జరుగుతుంది.

Pages