S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/13/2019 - 05:41

దుబాయ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20ల్లో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మొదటి ర్యాంకులో కొనసాగుతున్న కోహ్లీ, పొట్టి క్రికెట్‌లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో రెండు అర్ధ సెంచరీలతో పాటు మొత్తం 183 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.

12/13/2019 - 05:38

పెర్త్, డిసెంబర్ 12: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మొదటి రోజు ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయ 248 పరుగు లు చేసింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిలకడగా ఆడే ప్రయత్నం చేసింది. అయితే జట్టు స్కోరు 40 పరుగుల వద్ద ఓపెనర్ జో బర్న్స్ (9) డీగ్రాండ్ హోం బౌలింగ్‌లో మొదటి వికెట్‌గా అవుట య్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లబూ స్‌ఛేంజ్‌తో వార్నర్‌తో జతకట్టాడు.

12/13/2019 - 05:35

రావల్పిండి, డిసెంబర్ 12: రావల్పిం డిలో జరుగుతున్న పాక్-శ్రీలంక మొద టి టెస్టుకు వర్షం అంతరాయం కలిగిం చింది. ఓవర్ నైట్ స్కోరు 202 /5తో రెండోరోజూ గురువారం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు మరో 61 పరుగు లు మాత్రమే చేసింది. మధ్యలో వరు ణుడు మ్యాచ్‌కు అడ్డుతగలడంతో అంపైర్లు నిలిపివేశారు. రెండో రోజు కేవలం 18 ఓవర్ల మ్యాచ్ మాత్రమే సాగింది. ధనుంజయ డిసిల్వా (72). దిల్రూవన్ పెరీరా (2) క్రీజులో ఉన్నారు.

12/13/2019 - 05:34

*చిత్రం... జార్ఖండ్‌లో మూడో విడత పోలింగ్‌లో భాగంగా రాంచీలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటేసేందుకు వచ్చిన టీమిండియా ఆటగాడు, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్.

12/13/2019 - 05:32

హైదరాబాద్, డిసెంబర్ 12: రంజీ ట్రోఫీ 2019-20లో భాగంగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ పరాజయం పాలైంది. ఓవర్ నైట్ స్కోర్ 239 పరుగులతో నాలుగో రోజు బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 266 పరుగులకే ఆలౌటైంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టు 2 వికెట్లు కోల్పోయ విజయం సాధించింది. కెప్టెన్ ప్రియాంక్ పంచల్ (90), భార్గవ్ మెరై (69) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

12/13/2019 - 05:31

*చిత్రం... మెల్‌బోర్ నలో జరిగిన ప్రెసిడెంట్స్ కప్ గోల్ఫ్ కప్ టోర్నమెంట్ ప్రారంభ రౌండ్‌లో రాయల్ మెల్‌బోర్న్ గోల్ఫ్ క్లబ్ వారి ఫోర్ బాల్ మ్యాచ్‌లో భాగంగా 7వ హోల్‌పై తన స్కీండ్ షాట్ చూసిన యూస్ ఆటగాడు టైగర్ వుడ్స్.

12/13/2019 - 05:29

*చిత్రం... పెర్త్‌ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్‌ను సమీపంలోని ప్రమోషనల్ పూల్ నుంచి వీక్షిస్తున్న అభిమానులు.

12/13/2019 - 05:26

ముంబయిలో జరిగిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో లాలిగా కంపెనీ బ్రాండ్ అంబాసీడర్‌గా టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను ప్రకటిస్తున్న ఆ కంపెనీ భారత మేనేజింగ్ డైరెక్టర్ జోస్ అంటోనియో కాచజా. స్పానిష్ టాప్ ఫుట్‌బాల్ లీగ్ లాలిగాకు రోహిత్ మొదటి నాన్ ఫుట్‌బాల్ ప్లేయర్ బ్రాండ్ అంబాసీడర్ కావడం విశేషం.

12/12/2019 - 01:13

వెస్టిండీస్‌తో ముంబయి వాంఖడే స్టేడియంలో బుధవారం జరిగిన చివరి, మూడో టీ-20 ఇంటర్నేషనల్‌ను 67 పరుగుల తేడాతో గెల్చుకొని, సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆనందం

12/12/2019 - 01:02

ముంబయి: వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో చెలరేగింది. దీంతో 67 పరుగుల తేడాతో విజయం సాధించడంతో పాటు మూడు మ్యాచుల టీ20 సిరీస్‌నూ కైవసం చేసుకుంది. అంతకుముం దు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్‌లు చక్కటి శుభారంభం అందించారు. వీరిద్దరూ ధాటిగా ఆడడంతో జట్టు స్కోరు 5 ఓవర్లలోనే 50 పరుగులు దాటింది.

Pages