S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/21/2016 - 07:19

భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పది మంది క్రికెట్ బుకీల ముఠాను పోలీసులు ఆదివారం అరెస్టుచేశారు. వీరు పట్టణంలోని శివరావుపేటలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని రహస్యంగా బెట్టింగులు నిర్వహిస్తున్నారు.
ఐసిసి టి-20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆదివారం జరిగిన సౌత్‌ఫ్రికా - ఆఫ్గానిస్తాన్ మ్యాచ్‌పై బెట్టింగులు నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు దాడిచేసి, వీరిని అరెస్టుచేశారు.

03/21/2016 - 07:17

హైదరాబాద్: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో శాశ్వత హెలిపాడ్‌ను ఏర్పాటు చేయాలని అమరావతి అభివృద్ధి అథారిటీ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ప్రపంచ స్థాయి రాజధాని నగరం నిర్మితమవుతున్న అక్కడకు విచ్చేసే అధికారులు, ప్రజాప్రతినిధుల సౌకర్యార్థం హెలిపాడ్ ఏర్పాటు చేసి 10 సీటర్ విమానాలు, హెలికాప్టర్లు వంటివి దిగేందుకు వీలు కల్పించాలని అథారిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు ఆ లేఖలో కోరారు.

03/21/2016 - 02:37

విశాఖపట్నం: దళిత, ఆదివాసీ, బిసి, మైనార్టీలకే కాదు భారత ప్రజలందరికీ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కలియుగ దైవమని పిసిసి చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన దళిత, ఆదివాసీ, బిసి, మైనార్టీ సామాజిక న్యాయ సాధికారత యాత్రను పిపిసి చీఫ్ విశాఖలో ఆదివారం ప్రారంభించారు.

03/21/2016 - 02:36

కాకినాడ: ఎపి ఎంసెట్- 2016కు హాజరుకాదలచిన విద్యార్థులకు దరఖాస్తుల దాఖలుకు విధించిన గడువు సోమవారంతో ముగియనుంది. గడువు తేదీలోగా దరఖాస్తులు దాఖలుచేసుకోలేని విద్యార్థులకు అపరాధ రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

03/21/2016 - 02:34

విజయవాడ: ఆర్ధిక సంక్షోభం... దానికితోడు దశాబ్దాల తరబడి వెంటాడుతున్న నష్టాల నుంచి గడచిన ఏడాది కాలంగా బైటపడుతూ ఇప్పుడిప్పుడే కొద్దో గొప్పో లాభాల బాటలో పయనిస్తున్న ఎపిఎస్‌ఆర్టీసీ ఒకేదఫా ఎంతో ప్రతిష్ఠాకరమైన నాలుగు జాతీయ అవార్డులను కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది.

03/21/2016 - 01:29

కర్నూలు, మార్చి 20: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమలో మరో క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునే యోచనలో ఉన్నట్టు తెలిసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. అంతేగాకుండా ముఖ్యమంత్రి తన దృష్టినంతా రాజధాని, కోస్తాంధ్రవైపే కేంద్రీకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

03/20/2016 - 18:03

గుంటూరు: అసెంబ్లీలో విపక్షనేత వైఎస్ జగన్ వైఖరి సమర్థనీయంగా లేదని, ఆయన చట్టసభలను అవమానపరిచేలా ప్రవర్తిస్తున్నారని ఎపి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆయన ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ, వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ విషయమై సభలో చర్చించేందుకు జగన్ ఎందుకు వెనుకంజ వేస్తున్నారని ప్రశ్నించారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పుకు అనుగుణంగానే స్పీకర్ రూలింగ్ ఇచ్చారన్నారు.

03/20/2016 - 14:04

తిరుమల : విశ్వహిందూపరిషత్‌ జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. మంత్రి మృణాళినితోపాటు సినీ నటి మంచు లక్ష్మీ తదితరులు కూడా దర్శించుకున్నారు.

03/20/2016 - 14:03

పశ్చిమగోదావరి : క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఐదుగురు బుకీలను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. బుకీల నుంచి 6 సెల్‌ఫోన్లు, రూ. 32 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ట్వంటీ టంట్వీ వరల్డ్ కప్ మ్యాచ్‌లకు సంబంధించి వీరు బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారని సమాచారం. శనివారం రాత్రి జరిగిన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు పెద్దఎత్తున బెట్టింగ్ లు నిర్వహించినట్లు సమాచారం.

03/20/2016 - 13:58

తిరుమల : ఓ అజ్ఞాత భక్తుడు బంగారు శంఖును తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి బహుకరించాడు. ఆదివారం శ్రీవారి హుండీలో ఈ శంఖు లభ్యమైంది. దీని విలువ దాదాపు రూ. 50 లక్షలు ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు.

Pages