ఆంధ్రప్రదేశ్‌

దరఖాస్తుల దాఖలుకు నేడే చివరి తేదీ ( ఎపి ఎంసెట్2016)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: ఎపి ఎంసెట్- 2016కు హాజరుకాదలచిన విద్యార్థులకు దరఖాస్తుల దాఖలుకు విధించిన గడువు సోమవారంతో ముగియనుంది. గడువు తేదీలోగా దరఖాస్తులు దాఖలుచేసుకోలేని విద్యార్థులకు అపరాధ రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నెల 22వ తేదీ నుండి ఏప్రిల్ 27వ తేదీ వరకు అంచెలా వారీగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయించిన అపరాధ రుసుంను చెల్లించి, దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చని ఎపి ఎంసెట్-2016 కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు ‘ఆంధ్రభూమి ప్రతినిధి’కి తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు రూ.500 అపరాధ రుసుంతో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 11వరకు రూ.1000, ఏప్రిల్ 19వ తేదీ వరకు రూ.5000 అపరాధ రుసుంతో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 27వ తేదీ వరకు రూ.10,000 అపరాధ రుసుంతో దరఖాస్తులు స్వీకరిస్తారు. అపరాధ రుసుం చెల్లించే వరకు పరిస్థితి రాకుండా నిర్దేశించిన గడువు సోమవారం లోగా తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో దాఖలు చేసుకోవాలని కన్వీనర్ సాయిబాబు కోరారు. ఎంసెట్‌కు ఆదివారం వరకు 2,55,212 దరఖాస్తులు దాఖలైనట్టు ఆయన చెప్పారు. ఇందులో ఇంజనీరింగ్‌కు సంబంధించి 1,62,396 మంది, మెడిసిన్, అగ్రికల్చర్‌లో ప్రవేశానికి 90, 908 మంది, రెండు విభాగాలకు 954 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నట్టు వివరించారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిధిలో 1,36,306 మంది, ఉస్మానియా విశ్వ విద్యాలయం పరిధిలో 35,977 మంది, శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం పరిధిలో 75,829 మంది, నాన్ లోకల్ కేటగిరీలో 7100 మంది విద్యార్థులు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్నట్టు పేర్కొన్నారు. గత సంవత్సరం నుండి వరుసగా రెండోసారి జెఎన్‌టియుకె ఎంసెట్ నిర్వహిస్తోందన్నారు. ఏప్రిల్ 21 నుండి 27వ తేదీ వరకు హాల్‌టిక్కెట్స్‌ను డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఎపిఎంసెట్.ఒఆర్‌జి వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. ఏప్రిల్ 29న ఎపి ఎంసెట్‌ను నిర్వహిస్తామన్నారు. ఆ రోజు ఉదయం 10నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2.30నుండి సాయంత్రం 5.30 గంటల వరకు అగ్రికల్చర్, మెడిసిన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని డాక్టర్ సాయిబాబా తెలిపారు.