ఆంధ్రప్రదేశ్‌

సీమలో సిఎం క్యాంపు ఆఫీస్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మార్చి 20: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమలో మరో క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునే యోచనలో ఉన్నట్టు తెలిసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. అంతేగాకుండా ముఖ్యమంత్రి తన దృష్టినంతా రాజధాని, కోస్తాంధ్రవైపే కేంద్రీకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేగాకుండా రాయలసీమలో ఒక నగరాన్ని రెండవ రాజధానిగా ఎంపిక చేయాలని, హైకోర్టు బెంచి ఏర్పాటు చేయాలన్న డిమాండు వినిపిస్తోంది. ఈ విమర్శలకు సమాధానంగా రాయలసీమలో తన క్యాంపు కార్యాలయాన్ని నిర్మించుకోవడం, తరచూ మంత్రివర్గ సమావేశాలు, రాయలసీమ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించడం వంటి పనులను చేపట్టాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాజధాని నగరం అమరావతిలో ఇప్పటికే తాత్కాలిక సచివాలయం, శాసనసభ, శాసన మండలి భవనాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. వీటిని వచ్చే జూన్ నాటికి ప్రారంభించి ఆ వెంటనే మంత్రులు, ఎమ్మెల్యేల నివాసం కోసం క్వార్టర్ల నిర్మాణం చేపట్టాలని, ఆ తరువాత సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే హైకోర్టు భవన నిర్మాణం, న్యాయమూర్తుల క్వార్టర్ల నిర్మాణం చేపట్టాలన్న ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో రాయలసీమలో సిఎం క్యాంపు కార్యాలయం నిర్మించి ప్రతి నెలా నాలుగైదు రోజులు తన కార్యకలాపాలను నిర్వహిస్తూ రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సిఎం క్యాంపు కార్యాలయం కర్నూలులో, హైకోర్టు బెంచి అనంతపురం లేదంటే కడప నగరాల్లో ఒక చోట ఏర్పాటు చేయవచ్చని సమాచారం. ముఖ్యమంత్రి తుది నిర్ణయానికి వస్తే దసరా తరువాత నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశముంది.