ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో శాశ్వత హెలిపాడ్ ఏర్పాటు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో శాశ్వత హెలిపాడ్‌ను ఏర్పాటు చేయాలని అమరావతి అభివృద్ధి అథారిటీ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ప్రపంచ స్థాయి రాజధాని నగరం నిర్మితమవుతున్న అక్కడకు విచ్చేసే అధికారులు, ప్రజాప్రతినిధుల సౌకర్యార్థం హెలిపాడ్ ఏర్పాటు చేసి 10 సీటర్ విమానాలు, హెలికాప్టర్లు వంటివి దిగేందుకు వీలు కల్పించాలని అథారిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు ఆ లేఖలో కోరారు. రోజు రోజుకీ అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు రాకపోకలు పెరుగుతున్నందున అమరావతిలో ఉన్న 120 ఎకరాల ఎపి సీడ్ ఫాంకు చెందిన వ్యవసాయ భూమిలో ఈ హెలిపాడ్‌ను ఏర్పాటు చేసుకునేందుకు వీలుంటుందని సూచించారు. వీలైనంత త్వరగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
తక్కువ వడ్డీరేట్ల దిశగా సాగాల్సిందే
* చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్ల తగ్గింపుపై జైట్లీ
న్యూఢిల్లీ, మార్చి 20: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను తగ్గించడంపై అన్ని వర్గాలనుంచి విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత సమర్థవంతమైనదిగా మారాలంటే దేశం తక్కువ వడ్డీ రేట్ల దిశగా ముందుకు కదలాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో దశలో దివాలా, వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) బిల్లులు ఆమోదం పొందుతాయన్న ఆశాభావాన్ని జైట్లీ వ్యక్తం చేశారు. జిఎస్‌టి బిల్లుపై విభేదాలు తగ్గుతూ వస్తున్నాయని ఆయన అంటూ, కాంగ్రెస్ పార్టీని ఒప్పించడానికి తాను, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మరిన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.
ఇక్కడ జరుగుతున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల చివరి రోజయిన ఆదివారం జైట్లీ మీడియాతో మాట్లాడుతూ చిన్న మొత్తాల పొదుపుపథకాలపై వడ్డీ రేట్లు ఫార్ములా ఆధారితమైనవని, ప్రభుత్వం మార్కెట్ నిర్ణయించే రేట్లకు మించి ఈ పథకాలపై సబ్సిడీ ఇవ్వడం కోసం ప్రభుత్వం తన వనరులను ఉపయోగించేదని చెప్పారు. పిపిఎఫ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ పథకాలపై వడ్డీ రేట్లను తగ్గించడంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన విమర్శలను జైట్లీ తోసిపుచ్చుతూ, యుపిఏ ప్రభుత్వం కూడా ఇదే ఫార్ములా ప్రకారమే వెళ్లిందని, అయితే అప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ బాగా లేని కారణంగా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండేవని చెప్పారు.