ఆంధ్రప్రదేశ్‌

ప.గో.లో పదిమంది క్రికెట్ బుకీలు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పది మంది క్రికెట్ బుకీల ముఠాను పోలీసులు ఆదివారం అరెస్టుచేశారు. వీరు పట్టణంలోని శివరావుపేటలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని రహస్యంగా బెట్టింగులు నిర్వహిస్తున్నారు.
ఐసిసి టి-20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆదివారం జరిగిన సౌత్‌ఫ్రికా - ఆఫ్గానిస్తాన్ మ్యాచ్‌పై బెట్టింగులు నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు దాడిచేసి, వీరిని అరెస్టుచేశారు.
అరెస్టయిన వారిలో ఆంధ్ర, తెలంగాణ, హర్యానా రాష్ట్రాలకు చెందిన వారున్నారు. వీరి నుండి ఒక లైన్ ఫోన్ బాక్సు, 4 ల్యాప్‌టాప్‌లు, 62 సెల్‌ఫోన్‌లు, ఒక ప్రింటర్, రెండు ఎల్‌సిడి టివిలు, ఒక కారు, రూ.25వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు టూటౌన్ సిఐ ఎం రమేష్‌బాబు విలేఖర్లకు తెలిపారు. పం దాల లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారానే జరుపుతుంటారని సమాచారం. అరెస్టయిన వారిలో హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మహ్మద్ గౌస్ ప్రధాన సూత్రదారుడని సిఐ తెలిపారు. అతనితోపాటు హైదరాబాద్ వౌలాలీకి చెందిన మహ్మద్ వహీద్, మల్కాజ్‌గిరికి చెందిన షేక్ కరీం, సికింద్రాబాద్‌కు చెందిన ఆచార్య శ్రావణ్‌కుమార్, గడ్డా కిరణ్, కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఉప్పులూరు మిరూద్దీన్, షామీర్ బాషా, హర్యానా రాష్ట్రం శిరసా జిల్లా మండవారి గ్రామానికి చెందిన బన్సన్ రాజీవ్, భీమవరం శివరావుపేటకు చెందిన తామరపల్లి సత్యప్రసాద్, రాయలం గ్రామానికి చెందిన కొల్లి బాలాజీ అరెస్టయినవారిలో ఉన్నారని సిఐ రమేష్‌బాబు వివరించారు.

పోలీసులు అరెస్టు చేసిన బుకీలు