S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/21/2016 - 11:54

హైదరాబాద్: వైకాపా ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలంటూ సభాహక్కుల సంఘం సిఫారసు చేసింది. ఈ సిఫారసును ఆమోదించేందుకు సోమవారం ఉదయం ఎపి అసెంబ్లీలో చర్చ జరగనుంది. తమ ఎదుట రోజా హాజరుకాకపోవడాన్ని కూడా సభా హక్కుల సంఘం సభ్యులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది.

03/21/2016 - 11:53

హైదరాబాద్: వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ విషయమై ఎపి అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం ఉదయం హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఉభయ పక్షాల వాదనలను న్యాయమూర్తులు పరిశీలిస్తున్నారు.

03/21/2016 - 11:53

తిరుపతి: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అమర్‌సింగ్ సోమవారం ఉదయం తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు.

03/21/2016 - 11:51

విజయవాడ: డిపాజిట్ల పేరుతో వేలాది రూపాయలను వసూలు చేసి తమను వంచించిన ‘అగ్రిగోల్డ్’పై చట్టపరంగా చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆ సంస్థ బాధితులు సోమవారం ఇక్కడ భారీ ర్యాలీ నిర్వహించారు. ఎపి, తెలంగాణలోని పలు ప్రాంతాలకు చెందిన బాధితులు ర్యాలీలో పాల్గొన్నారు.

03/21/2016 - 11:51

హైదరాబాద్: వైకాపా ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తూ ఇటీవల స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై గోపాలకృష్ణ కళానిధి అనే న్యాయవాది సోమవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై విచారణను మంగళవారానికి వాయిదా వేసినట్లు కోర్టు ప్రకటించింది.

03/21/2016 - 07:35

చిత్తూరు: చిత్తూరు జిల్లా పరిషత్ బడ్జెట్ సమావేశంలో హైడ్రామా చోటుచేసుకుంది. ఆదివారం జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి అధ్యక్షతన జరిగిన జడ్పీ బిడ్జెట్ సమావేశంలో అనేక ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. నిర్ణీత సమయానికి సమావేశం ప్రారంభం కాకపోవడాన్ని నిరసిస్తూ వైకాపా సభ్యులు వాకౌట్ చేసి జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట కొంతసేపు బైఠాయించారు.

03/21/2016 - 07:34

రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాలు ప్రారంభోత్సవం రోజు గత ఏడాది జూలై 14న రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటపై సోమవారం విచారణ జరగనుంది. ఈ సంఘటనకు దారితీసిన కారణాలు, ఏర్పాట్లలో ఏమైనా లోపాలు ఉన్నాయా? బాధ్యులెవరు తదితర అంశాలపై విచారణ నిర్వహించడానికి రాష్ట్రప్రభుత్వం జస్టిస్ సోమయాజులు కమిషన్‌ను నియమించిన సంగతి విదితమే.

03/21/2016 - 07:33

మార్కాపురం: పోలవరం ప్రాజెక్టును 2018లోపు పూర్తిచేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీని కూడా నియమించిందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పి మాణిక్యాలరావు తెలిపారు.

03/21/2016 - 07:32

అనంతపురం: రాయలసీమలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. గడచిన వారం రోజులుగా మండుతున్న ఎండలతో జనం విలవిలలాడుతూ ఉండగా రెండు మూడు రోజుల నుంచీ పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయి. అనంతపురం జిల్లాలో ఆదివారం అత్యధికంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. దీంతోప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.

03/21/2016 - 07:29

అనంతపురం: కరవుకు శాశ్వత చిరునామాగా మారిన అనంతపురంలో జిల్లా నుంచి 2006లో అప్పటి కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వం ప్రారంభించిన ఉపాధి హామీ పథకం లక్ష్యానికి దూరంగా సాగుతోంది. ఇక్కడ కూలీలకు కనీస వేతనం అందని పరిస్థితి ఉండగా వంద రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న కుటుంబాల సంఖ్య సైతం అతి తక్కువగానే ఉంది.

Pages