ఆంధ్రప్రదేశ్‌

2018లోగా పోలవరం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం: పోలవరం ప్రాజెక్టును 2018లోపు పూర్తిచేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీని కూడా నియమించిందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పి మాణిక్యాలరావు తెలిపారు. ఆదివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరాన్ని చెప్పిన సమయానికి పూర్తిచేసి నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించి సస్యశ్యామలం చేయడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ధ్యేయమని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ భూములు కొన్నట్లు ఆరోపణలు చేశారని, అయితే ఆధారాలు చూపిస్తే మంత్రులను క్యాబినెట్ నుంచి తొలగిస్తామని చంద్రబాబు సవాల్ విసిరితే వెనుకడుగు వేశారని అన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అసంబద్ధంగా విభజన చేయడం వల్ల ఆంధ్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంటే వారు మాత్రం ఢిల్లీలో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే విభజన సమయంలోనే ప్రత్యేక హోదా కల్పించి ఉండేవారని అన్నారు. ఇప్పుడు సవతిప్రేమ చూపుతూ ఆంధ్రా నుంచి మట్టి, సంతకాలు చేసిన కాగితాలను తీసుకువెళ్లి సోనియాగాంధీకి ఇచ్చి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని మంత్రి ధ్వజమెత్తారు. ఎపి అభివృద్ధిలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేసి బిజెపి కట్టుబడి ఉంటుందని అన్నారు. మిత్రపక్షంగా ఉన్న టిడిపిపై బిజెపి ఎంఎల్‌సి సోము వీర్రాజు చేస్తున్న ఆరోపణలపై పాత్రికేయులు ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులను అక్రమమార్గంలో తరలిస్తున్నారని బిజెపి నేత పురంధ్రీశ్వరి చేస్తున్న ఆరోపణలపై మంత్రి మాణిక్యాలరావును ప్రశ్నించగా వాస్తవంగా కేంద్రం నుంచి వచ్చిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంటుందని అన్నారు.
కృష్ణా పుష్కరాలకు రూ. 450 కోట్లు
ఆగస్టులో జరగనున్న కృష్ణా పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం 400 కోట్ల రూపాయలను విడుదల చేసిందని మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. అలాగే దేవస్థానాల నుంచి 50 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
ఇప్పటికే కృష్ణా పుష్కరాల పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కరాలను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.

అసెంబ్లీ ఘటనలు
బాధ కలిగిస్తున్నాయి
కేంద్ర మంత్రి అశోక్‌గజపతి రాజు

విజయనగరం, మార్చి 20: రాష్ట్ర అసెంబ్లీలో ఇటీవల తలెత్తిన కొన్ని సంఘటనలు, సభ్యుల ప్రవర్తన ఆందోళన, బాధ కలిగించే విధంగా ఉన్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు పేర్కొన్నారు. గతంలో కూడా తనపై ఒక ఎమ్మెల్యే దాడికి ప్రయత్నించిన సందర్భంలో అప్పటి స్పీకర్ తీవ్రంగా స్పందించి చర్యలు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేసారు. ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో నియమ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, గీత దాటితే స్పీకర్ చర్యలు తీసుకోవటం మామూలేనని ఆయన వ్యాఖ్యానించారు. విజయనగరం పర్యటన సందర్భంగా ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అసెంబ్లీలో రోజా వ్యవహారంపై ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయవ్యవస్థ, చట్టసభలపై గురుతర బాధ్యతలు ఉన్నాయని అన్నారు. ఇటీవల ఢిల్లీలో న్యాయస్థానం వద్ద కొందరు న్యాయవాదులు ప్రవర్తించిన తీరు సరిగా లేదని గమనించిన ఉన్నత న్యాయస్థానం ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి ఆ కమిటీ ఇచ్చిన నివేధిక ఆధారంగా బాధ్యులైన న్యాయవాదులను మందలించిందని చెబుతూ, అసెంబ్లీలో సభ్యులు బాధ్యతతో వ్యవహరించకుంటే స్పందించవలసిన అవసరం స్పీకర్‌కు ఉందని తెలిపారు. గతంలో తనపై ఒక ఎమ్మెల్యే దాడికి యత్నించిన సందర్భంలో, మార్షల్స్‌పై దాడి చేసిన సందర్భంలో అప్పటి స్పీకర్లు తీసుకున్న చర్యలను గుర్తుచేసారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై కాకుండా అనవసర విమర్శలు, తిట్ల పురాణానికి ప్రాధాన్యత ఇవ్వటం పట్ల ఆందోళన వ్యక్తం చేసారు. దీనివల్ల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలపై చర్చ, పరిష్కార మార్గాలకు అవకాశం లేకుండా పోతోందని తెలిపారు. తాము ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రజాసమస్యలపై స్పదించటంతోపాటు సభా వ్యవహారాల నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించామన్నారు. ప్రస్తుత ప్రతిపక్ష సభ్యుల్లో ఈ వైఖరి కనపడటం లేదని అన్నారు.