ఆంధ్రప్రదేశ్‌

లక్ష్యం చేరని ఉపాధి ‘హామీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: కరవుకు శాశ్వత చిరునామాగా మారిన అనంతపురంలో జిల్లా నుంచి 2006లో అప్పటి కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వం ప్రారంభించిన ఉపాధి హామీ పథకం లక్ష్యానికి దూరంగా సాగుతోంది. ఇక్కడ కూలీలకు కనీస వేతనం అందని పరిస్థితి ఉండగా వంద రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న కుటుంబాల సంఖ్య సైతం అతి తక్కువగానే ఉంది. వీటితోపాటు ప్రతి ఏటా ఉపాధి హామీ పథకానికి లభ్యమవుతున్న నిధుల్లో కూలీల వేతనాల కోసం ఖర్చు చేసిన శాతం కూడా అతి తక్కువగానే ఉంది. దీనివల్ల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అసలు లక్ష్యం దెబ్బతింటోండగా జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. గత ఐదు సంవత్సరాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ప్రతి ఏటా లభ్యమవుతున్న నిధులు, ఖర్చు చేసిన మొత్తం, కూలీలకు వేతనాల రూపంలోచెల్లించిన మొత్తాలు, వంద రోజులు పూర్తి చేసుకున్న కుటుంబాల వివరాలను పరిశీలిస్తే పథకం తీరు తెన్నులు అర్థమవుతాయి. ఇందులోప్రధానంగా వేతనాల సమస్యను తీసుకుంటే 2011-12 సంవత్సరంలోకనీస వేతనాన్ని రూ.100-125 గా నిర్ణయించారు. అయితే జిల్లాలోని కూలీలకు సగటున చెల్లించింది మాత్రం రూ.106.78 కావడం గమనార్హం. 2012-13 సంవత్సరంలోకనీస వేతనం రూ.125-155గా నిర్ణయించగా కూలీలు సగటున తీసుకున్న వేతనం రూ.119.21 మాత్రమే. 2013-14 సంవత్సరంలోకనీస వేతనాన్ని రూ.155-174గా నిర్ణయించగా కూలీలు సగటున అందుకున్న వేతనం రూ.124.28 మాత్రమే కావడం గమనార్హం. 2014-15 సంవత్సరంలోకనీస వేతనాన్ని రూ.155-180 గా నిర్ణయించగా సగటున కూలీలు అందుకున్నది రూ.136.25 కాగా, 2015-16 సంవత్సరంలోకనీస వేతనాన్ని రూ.180గా నిర్ణయించగా కూలీలకు సగటున చెల్లించినది రూ. 139.59 మాత్రమే కావడం గమనార్హం. ఇలా జిల్లాలోగడచిన ఐదు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో కనీస వేతనాన్ని అందుకున్న కూలీలు లేకపోగా రూ.140 మించి వేతనాన్ని అందుకున్న సందర్భాలు సైతం లేకపోవడం గమనార్హం. ఇక 2011-12 సంవత్సరంలోజిల్లాలో ఉపాధి హామీ పథకానికి రూ.273.80 కోట్లు మంజూరు కాగా ఇందులో రూ.270.79 కోట్లను ఖర్చు చేయగా అందులో కూలీలకు వేతనాల రూపంలో 76.60 శాతం నిధులను (రూ.207.42 కోట్లను) మాత్రమే చెల్లించారు. ఇక 2012-13 సంవత్సరంలో రూ.331.50 కోట్ల నిధులు రాగా రూ.312.87 కోట్లను ఖర్చు చేయగా కూలీలకు వేతనాల రూపంలో 71.77 శాతం నిధులను (రూ.224.56 కోట్లను) మాత్రమే ఖర్చు చేశారు. 2013-14 సంవత్సరంలో రూ.324.10 కోట్ల నిధులు లభ్యం కాగా ఇందులో రూ.305 కోట్లను ఖర్చు చేయగా కూలీలకు వేతనాల రూపంలో 67.85 శాతం నిధులు (రూ.206.94 కోట్లు) మాత్రమే ఖర్చు చేశారు. 2014-15 సంవత్సరంలో రూ.261.60 కోట్ల నిధులు లభ్యం కాగా అందులో రూ.240.93 కోట్ల నిధులను ఖర్చు చేయగా కూలీలకు వేతనాల రూపంలో 60.71 శాతం (రూ.146.26 కోట్లను) ఖర్చు చేశారు. 2015-16 సంవత్సరంలో రూ.353.20 కోట్ల నిధులు లభ్యం కాగా రూ.342.06 కోట్లు ఖర్చు చేయగా కూలీలకు వేతనాల రూపంలో 66.60 శాతం (రూ.227.80 కోట్లను) మాత్రమే ఖర్చు చేశారు. ఇలా జిల్లాలో 2011-12 నుంచి 2015-16 వరకూ ఐదు సంవత్సరాల్లో రూ.1544.00 కోట్ల నిధులు లభ్యం కాగా ఇందులో రూ.1471.64 కోట్లు ఖర్చు చేయగా కూలీలకు వేతనాల రూపంలో 68.83 శాతం (రూ.1012.98 కోట్లు) మాత్రమే ఖర్చు చేయడం గమనార్హం. ఇక నిత్య కరవుజిల్లా అయిన అనంతపురంలో వంద రోజుల పనిదినాలను పూర్తి చేసుకున్న కుటుంబాల సంఖ్య సైతం అతి తక్కువగానే ఉంది. కరవు జిల్లాలో సైతం కూలీలకు కనీస వేతనాలు అందకపోగా వంద రోజుల పనిదినాలను పూర్తి చేసుకున్న కుటుంబాల సంఖ్య కూడా అతి తక్కువగానే ఉంది. వీటితోపాటు 2011-12 సంవత్సరం నుంచీ 2015-16 సంవత్సరం వరకూ ఐదు సంవత్సరాల్లో ఉపాధి హామీ పథకానికి లభ్యమైన నిధుల్లో కూలీల వేతనాల కోసం 68.83 శాతం నిధులను మాత్రమే ఖర్చు చేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా కూలీలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు తరలి వెళుతూనే ఉండగా ఈ పథకం అసలు లక్ష్యం మాత్రం దెబ్బతింటూ ఉంది.