ఆంధ్రప్రదేశ్‌

చిత్తూరు జడ్పీలో హైడ్రామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: చిత్తూరు జిల్లా పరిషత్ బడ్జెట్ సమావేశంలో హైడ్రామా చోటుచేసుకుంది. ఆదివారం జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి అధ్యక్షతన జరిగిన జడ్పీ బిడ్జెట్ సమావేశంలో అనేక ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. నిర్ణీత సమయానికి సమావేశం ప్రారంభం కాకపోవడాన్ని నిరసిస్తూ వైకాపా సభ్యులు వాకౌట్ చేసి జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట కొంతసేపు బైఠాయించారు. సమావేశానికి నిర్ణీత సమయానికే వచ్చిన కలెక్టర్ సుమారు గంటపాటు వేచి చూసి చివరకు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. ఈ సమావేశానికి జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి అధ్యక్షత వహించగా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేవలం అరగంట వ్యవధిలోనే చైర్‌పర్సన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం, దీన్ని అధికారపక్ష సభ్యులు ఆమోదించడం జరిగిపోయింది.
ఆలస్యంపై కలెక్టర్ ఆగ్రహం
జడ్పీ బడ్జెట్ సమావేశానికి నిర్ణీత సమయానికి కలెక్టర్ సిద్దార్థజైన్ జడ్పీ సమావేశ మందిరానికి విచ్చేశారు. అయితే సుమారు గంటపాటు వేచి ఉన్నా సమావేశం ప్రారంభం కాకపోవడంతో కలెక్టర్ కొంత అసహనం వ్యక్తం చేశారు. అనంతరం జడ్పీ సిఇవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 10.30 గంటలకు వచ్చిన కలెక్టర్ సుమారు గంటసేపు సభ వేదికపై వేచి ఉండాల్సి వచ్చింది. ఈ సందర్భంగా పలువురు సభ్యుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతవరకు ఓపికగా ఉన్న కలెక్టర్ సమావేశం ప్రారంభంలో జాప్యం అనివార్యం అవుతుందని భావించి అక్కడి నుంచి నేరుగా వెళ్లిపోయారు.
ఇదిలావుండగా జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్‌పై అధికార పార్టీకి చెందిన పలువురు జడ్పీటిసిలు, ఎంపిపిలు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఎంపిపిలు, జడ్పీటిసిలు అంటే విలువ ఇవ్వడం లేదని వాపోయారు. కలెక్టర్‌ను వెంటనే బదిలీ చేయాలని కూడా మంత్రిపై ఒత్తిడి చేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి వారికి హామీ ఇచ్చినట్లు తెలియవచ్చింది.