S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/20/2016 - 03:17

పుట్టపర్తి, మార్చి 19: రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ అనంతపురం జిల్లా పుట్టపర్తి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (పుడా) వైస్ చైర్మన్ రామాజంనేయులు శనివారం ఏసిబి అధికారులకు పట్టుబడ్డారు. పుట్టపర్తి పట్టణానికి చెందిన బిల్డర్ సుబ్బరాజు నుండి రూ.2 లక్షలు లంచం తీసుకుంటున్న రామాజంనేయులును హైదరాబాద్‌కు చెందిన ఎసిబి కేంద్ర దర్యాప్తు విభాగం డిఎస్‌పి వివి ప్రసాదరావు ఆధ్వర్యంలో పట్టుకున్నారు.

03/20/2016 - 03:16

గుంటూరు, మార్చి 19: రైతుల నుంచి పూర్తిస్థాయిలో భూములు సమీకరించిన తరువాతనే రాజధాని నిర్మాణాలను చేపట్టాలనే తలంపులో ఉన్న రాష్ట్రప్రభుత్వం అందుకు అనుగుణంగా భూసేకరణ చట్టాన్ని అమలు చేసేందుకు పావులు కదుపుతోంది. ఇటీవల 177 ఎకరాలను భూసేకరణ చట్టం ద్వారా సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.

03/20/2016 - 03:15

కర్నూలు, మార్చి 19: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో రాష్ట్రంలో ఇంటర్నెట్ విప్లవానికి తెర లేచింది. డిజిటలైజేషన్‌లో భాగంగా టీవీ, ఇంటర్నెట్ మాధ్యమాల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టిన రెండు ప్రభుత్వాలు అంతర్జాతీయ స్థాయిలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోని, దాని ఫలితాలను జనానికి అందించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.

03/20/2016 - 02:48

హైదరాబాద్: అమరావతిలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎస్సెల్ గ్రూప్ ఆసక్తి చూపింది. కొత్త రాజధాని నగరంలో ఫన్ అండ్ రిక్రియేషన్ కోసం మల్టీ స్టోరీడ్ కాంప్లెక్స్ నిర్మించడానికి ముందుకొచ్చింది. శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసిన ఎస్సెల్ వరల్డ్ ప్రతినిధులు తమ ఆలోచనలను సిఎం ముందుంచారు.

03/20/2016 - 02:41

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి వైకాపా ఎమ్మెల్యే రోజాపైనే కాదు ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కొడాలి నానిపైనా సస్పెన్షన్ వేటుకు సభా హక్కుల (ప్రివిలేజస్) కమిటీ సిఫార్సు చేయనున్నది. శనివారం అసెంబ్లీ కమిటీ హాలులో కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన సమావేశం జరిగింది.

03/20/2016 - 02:40

విజయవాడ, మార్చి 19: రాష్ట్రాన్ని అభివృద్ధితో పాటు ఆనందమయ సూచికలో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషిచేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. వ్యాయామ, అక్షరాస్యత, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. ప్రాథమిక పాఠశాల నుంచే ప్రతి చిన్నారికి కూడా వ్యాయామ విద్యలో శిక్షణ అందేలా చర్యలు తీసుకోబోతున్నామన్నారు.

03/20/2016 - 02:29

విజయవాడ, మార్చి 19: రాష్ట్రంలో జనాభా పెరుగుదల రేటు తిరోగమన దశలో వుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గతంలో తాము కుటుంబ సంక్షేమ ప్రోత్సాహంపై తీసుకున్న చర్యలే ఇందుకు కారణమన్నారు. పశ్చిమ దేశాలు చైనా, జపాన్ వంటి దేశాల్లో జనాభా తగ్గుదల ఆందోళనకరంగా వుందంటూ తగినంత జనాభా లేక రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడుతున్నారన్నారు.

03/19/2016 - 18:13

విజయనగరం: అతి ప్రాచీనమైన రామతీర్థం ఆలయానికి నిధులు విడుదల చేయడంలో ఎపి సర్కారు వివక్ష చూపుతోందని ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, నిధులు మంజూరు చేస్తామన్న ప్రభుత్వ హామీ ఏడాదైనా అమలు కాలేదని, వచ్చే నెలలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకైనా నిధులు విడుదల చేయాలన్నారు.

03/19/2016 - 18:12

హైదరాబాద్: తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్న ఆంధ్ర ప్రాంత విద్యార్థులకు ఎపి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంటు బిల్లులు చెల్లించకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. ఫీజు రీయింబర్స్‌మెంటు చెల్లించని కారణంగా విద్యార్థులను పరీక్షలకు అనుమతించే ప్రసక్తి లేదని ఇప్పటికే కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు అల్టిమేటం ఇవ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు.

03/19/2016 - 18:18

అనంతపురం: వివాహేతర సంబంధం పెట్టుకుందన్న ఆగ్రహంతో ఓ మహిళను నడివీధిలో కొందరు మహిళలు వివస్త్రను చేసిన దారుణ సంఘటన గుంతకల్లు మండలం పులికొత్తపల్లి చిన్నతండాలో శనివారం జరిగింది. తన భర్తతో ఓ మహిళ అక్రమ సంబంధం పెట్టుకున్నందున తాను అనేక విధాలుగా అన్యాయానికి గురవుతున్నానని ఓ వివాహిత గ్రామంలోని మిగతా మహిళలకు ఫిర్యాదు చేసింది. దీంతో మహిళలంతా కలిసి ఆమెను వివస్త్రను చేశారు.

Pages