ఆంధ్రప్రదేశ్‌

రాజధానిలో 1700 ఎకరాల భూ సేకరణ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 19: రైతుల నుంచి పూర్తిస్థాయిలో భూములు సమీకరించిన తరువాతనే రాజధాని నిర్మాణాలను చేపట్టాలనే తలంపులో ఉన్న రాష్ట్రప్రభుత్వం అందుకు అనుగుణంగా భూసేకరణ చట్టాన్ని అమలు చేసేందుకు పావులు కదుపుతోంది. ఇటీవల 177 ఎకరాలను భూసేకరణ చట్టం ద్వారా సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో గల 21,500 మంది రైతుల ద్వారా 33,000 ఎకరాలు భూసమీకరణ ద్వారా ప్రభుత్వం సమీకరించాలనే లక్ష్యంతో సిఆర్‌డిఎని ఏర్పాటు చేసింది. రాజధాని ప్రాంతంలో మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ, వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులు ప్రత్యేకంగా మకాం వేసి రైతులతో నిరంతరం సంప్రదింపులు జరిపి భూములు తీసుకోవటంలో కీలకపాత్ర పోషించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులతో నేరుగా మాట్లాడి సంతృప్తికరమైన ప్యాకేజీ ప్రకటించి భూములు తీసుకోవటంలో విజయం సాధించారు. ప్రజలు, రైతులకు అనేక వాగ్దానాలు చేసి భూములు తీసుకునేందుకు చేసిన ప్రయత్నాలు సజావుగా సాగినప్పటికీ కొంత మంది రైతులు మాత్రం భూములు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం 33 వేల ఎకరాలను రైతులు భూసమీకరణ ద్వారా ఇచ్చారని పెద్దఎత్తున ప్రచారం చేసినప్పటికీ 4,300 ఎకరాలకు సంబంధించిన రైతులు ముందుకు రాకపోవటంతో భూసేకరణ చట్టాన్ని అమలు చేసేందుకు సమాయత్తమైంది. ఇప్పటి వరకు రైతుల నుంచి భూసమీకరణ ద్వారా 28,300 ఎకరాలు మాత్రమే సిఆర్‌డిఎ అధికారులు సేకరించారు. అంతేకాకుండా రైతుల నుంచి సేకరించిన 28,300 ఎకరాలకు సంబంధించిన 145 కోట్ల రూపాయల కౌలుపరిహారాలు చెల్లించారు. మిగిలిన 4,700 ఎకరాలను రైతుల నుంచి ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. తరతరాలుగా భూములను నమ్ముకుని ఉన్నందున బహుళ పంటలు పండే భూములను నిర్మాణాలకు ఇవ్వలేమంటున్న కొందరు రైతులు ఇప్పటికీ సేద్యం చేస్తున్నారు. వంశపారంపర్యంగా భూములు సక్రమిస్తున్నందున మరి కొంతమంది వద్ద పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్‌లు సక్రమంగా లేకపోవటాన్ని రెవిన్యూ అధికారులు గుర్తించారు. రాష్ట్రప్రభుత్వం ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ రాజధాని నిర్మాణాలకు భూములిచ్చేందుకు కొందరు రైతులు ముందుకు రాలేదు. మరికొందరు న్యాయస్ధానాలను ఆశ్రయించారు. ఇంకొందరు జరీబు భూములను మెట్ట్భూములుగా సిఆర్‌డిఎ అధికారులు గుర్తించి తమకు అన్యాయం చేసారంటూ న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. బహుళ పంటలు పండే భూములను నిర్మాణాలకు ఉపయోగించరాదంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌లో కేసులు దాఖలు చేశారు. ఇటువంటి కారణాలను గుర్తించిన రాష్ట్రప్రభుత్వం సుమారు 3 వేల ఎకరాలు వివాదాల్లో ఉన్నట్లు ప్రకటించింది. వివాదాలను పరిష్కరించే దిశగా మంత్రులు ఇప్పటికీ కృషి చేస్తున్నారు. రైతులు కోరిన విధంగా గ్రామకంఠాల సమస్యలను పరిష్కరించారు. అయితే ఫైనల్ మాస్టర్ ప్లాన్ ప్రకటించిన తరువాత మరికొన్ని సమస్యలు తాజాగా ఉత్పన్నం కావటంతో రైతులు రాష్ట్రప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివాదాల్లో భూములను మినహాయిస్తే ఇంకా 1,700 ఎకరాలకు సంబంధించిన భూములను నుంచి సేకరించాల్సి ఉంది.