ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో ఇంటర్నెట్ విప్లవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మార్చి 19: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో రాష్ట్రంలో ఇంటర్నెట్ విప్లవానికి తెర లేచింది. డిజిటలైజేషన్‌లో భాగంగా టీవీ, ఇంటర్నెట్ మాధ్యమాల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టిన రెండు ప్రభుత్వాలు అంతర్జాతీయ స్థాయిలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోని, దాని ఫలితాలను జనానికి అందించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలయినంత ఎక్కువగా వినియోగించుకోవాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలను ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్ ద్వారా అతి తక్కువ ధరకే కేబుల్ టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ సౌకర్యం కల్పిస్తామని ప్రజలకు స్పష్టం చేసిన సంగతి విదితమే. తాను చెప్పిన దాని కంటే తక్కువ సమయంలోనే ఈ విధానం ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే పథకాన్ని రెండు రోజుల క్రితం విశాఖపట్టణంలో లాంఛనప్రాయంగా ప్రారంభించారు. గత ఏడాది మార్చి నాటికి వెయ్యి టెరా బైట్ల ఇంటర్నెట్ వినియోగం ఉండగా తాజా అంచనాల ప్రకారం ఆరు వేల టెరాబైట్లకు చేరుకున్నట్టు తెలుస్తోంది. సెల్‌ఫోన్, కంప్యూటర్ల ద్వారా సుమారు కోటి మందికిపైగా ఇంటర్నెట్ సేవలను వినియోగిస్తున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం 3జి, 4జి సేవల్లో ఒక జీబీ ఇంటర్నెట్ వినియోగానికి సుమారు రూ.200 ఖర్చవుతోంది. బ్రాడ్ బాండ్‌లో సుమారు ఒక జీబీకి రూ.50 కంటే తక్కువగా ఖర్చవుతోంది. అయితే ఈ సేవలను బిఎస్‌ఎన్‌ఎల్‌ను మినహాయిస్తే, మిగిలిన ప్రైవేటు సంస్థలు పట్టణాలకే పరిమితం చేశాయి. ప్రభుత్వం ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఒఎఫ్‌సి) నెట్‌వర్క్ నిర్మాణం పూర్తి చేసి జూన్, జులై నాటికి గ్రామాలకు సైతం విస్తరిస్తే ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది.