ఆంధ్రప్రదేశ్‌

కొడాలిపైనా ఏడాది వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి వైకాపా ఎమ్మెల్యే రోజాపైనే కాదు ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కొడాలి నానిపైనా సస్పెన్షన్ వేటుకు సభా హక్కుల (ప్రివిలేజస్) కమిటీ సిఫార్సు చేయనున్నది. శనివారం అసెంబ్లీ కమిటీ హాలులో కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన సమావేశం జరిగింది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో టిడిపి, వైకాపా సభ్యులు పరస్పరం దూషించుకున్న అంశంపై విచారణ జరిపి నివేదిక సమర్పించేందుకు డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ కమిటీ సమర్పించిన నివేదికపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు సూచన మేరకు శనివారం ప్రివిలేజస్ కమిటీ సమావేశమైంది. కమిటీ ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించడంతో వైకాపా ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, నాని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి హాజరై తమ వాదన వినిపించారు. కాగా తాను స్పృహ కోల్పోయి ఆసుపత్రిలో చేరినందున, కమిటీ సమావేశాన్ని 15 రోజులపాటు వాయిదా వేయాల్సిందిగా రోజా కమిటీ చైర్మన్ సూర్యారావుకు లేఖ రాశారు. సమావేశానంతరం టిడిపి ఎమ్మెల్యే అనిత మీడియాతో మాట్లాడుతూ రోజాపై ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తనకు అయిన గాయం మానదని అన్నారు. ఏ దళిత ఎమ్మెల్యేకు ఇలా జరగరాదని ఆమె తెలిపారు. వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ పాలకపక్షం సభ్యులు రెచ్చగొట్టినందుకే తాను ఆవేశానికి లోనయ్యాయనన్నారు. మంత్రి అచ్చెన్నాయుడుపై తాను చేసిన వ్యాఖ్యలకు అప్పుడే క్షమాపణ చెప్పానని గుర్తు చేశారు. వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైకో, ఆర్థిక ఉగ్రవాది అని పాలకపక్ష సభ్యులు విమర్శించినందుకే తాను తట్టుకోలేక ఒకటి, రెండు మాటలన్నానని అన్నారు. ఇలాఉండగా కమిటీ సభ్యులు వారిని ఒక్కొక్కరినే పిలిపించుకుని వారి వాదన విన్నారు. ఆ తర్వాత కమిటీ ఈ అంశంపై చర్చించి, రోజాను, నానిని ఏడాది పాటు సస్పెండ్ చేయాల్సిందిగా సిఫార్సు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు సోమవారం స్పీకర్‌కు, సభకు నివేదిక అందజేస్తారు. ఇలాఉండగా నాని సోమవారం సభలో క్షమాపణ చెబితే అప్పుడు పాలకపక్షం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.