ఆంధ్రప్రదేశ్‌

ఏసిబి వలలో పుడా విసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, మార్చి 19: రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ అనంతపురం జిల్లా పుట్టపర్తి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (పుడా) వైస్ చైర్మన్ రామాజంనేయులు శనివారం ఏసిబి అధికారులకు పట్టుబడ్డారు. పుట్టపర్తి పట్టణానికి చెందిన బిల్డర్ సుబ్బరాజు నుండి రూ.2 లక్షలు లంచం తీసుకుంటున్న రామాజంనేయులును హైదరాబాద్‌కు చెందిన ఎసిబి కేంద్ర దర్యాప్తు విభాగం డిఎస్‌పి వివి ప్రసాదరావు ఆధ్వర్యంలో పట్టుకున్నారు. డిఎస్‌పి ప్రసాదరావు తెలిపిన వివరాల మేరకు.. సుబ్బరాజుకు చెందిన అపార్టుమెంటుకు డ్రైనేజీ సెస్ లక్షల్లో చెల్లించాలని పుడా కార్యాలయం నుండి నోటీసులు అందాయి. అంత చెల్లించలేనని సుబ్బరాజు పలుమార్లు పుడా కార్యాలయం చుట్టూ తిరిగాడు. తనకు రూ.2 లక్షలు ఇస్తే బిల్లులు తగ్గిస్తానని విసి రామాంజనేయులు చెప్పటంతో, సుబ్బరాజు ఏసిబి అధికారులను ఆశ్రయించాడు. ఎసిబి అధికారులు రూపొందించిన పథకం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో రామాంజనేయులుకు డబ్బు అందజేస్తుండగా, అక్కడ మాటు వేసిన ఎసిబి అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. తరువాత ఏకకాలంలో పట్టణంలోని రామాంజనేయులు నివాసం, అతని స్వగ్రామమైన గుత్తిలోని ఇంటి వద్ద, పుడా కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. అదేవిధంగా రామాంజనేయులుకు సన్నిహితంగా మెలిగే పుట్టపర్తి పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు వైద్యుని ఇల్లును సైతం ఏసిబి అధికారులు సీజ్ చేశారు. ఆ సమయంలో వైద్యుని కుటుంబం బెంగళూరు వెళ్లినట్లు సమాచారం. పుడా రామాంజనేయులు అధికార హోదాలో గతంలో ఏమైనా అవినీతికి పాల్పడ్డాడా.. అనే కోణంలో కార్యాలయంలోని ఫైళ్ళను, డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగా అతనికి ఆదాయానికి మించి అక్రమాస్తులు ఏవైనా వున్నాయా.. అని ఏసిబి అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్టు ఏసిబి అధికారులు తెలిపారు.