ఆంధ్రప్రదేశ్‌

కలియుగ దైవం అంబేద్కర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: దళిత, ఆదివాసీ, బిసి, మైనార్టీలకే కాదు భారత ప్రజలందరికీ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కలియుగ దైవమని పిసిసి చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన దళిత, ఆదివాసీ, బిసి, మైనార్టీ సామాజిక న్యాయ సాధికారత యాత్రను పిపిసి చీఫ్ విశాఖలో ఆదివారం ప్రారంభించారు. అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు దళిత, ఆదివాసీ, బిసి, మైనార్టీలకు కాంగ్రెస్ హయాంలోనే సంపూర్ణ న్యాయం జరుగుతుందన్న వాస్తవాన్ని వివరించేందుకే యాత్ర చేస్తున్నట్టు రఘువీరా ప్రకటించారు. అంటరానితనాన్ని నిర్మూలించాలని అంబేద్కర్ చేపట్టిన మహద్ చెరువుపోరాట స్పూర్తితో సామాజిక న్యాయ సాధికారిత యాత్రను తలపెట్టినట్టు తెలిపారు. కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం దళితులు, మైనార్టీలను కించపరిచే విధంగా వ్యవహిరిస్తోందని ఆరోపించారు. విశాఖ మన్యంలో ఆదివాసీల మ నోభావాలు దెబ్బతినే విధంగా బాక్సైట్ తవ్వకాలకు కేంద్రం అనుమతులు మంజూ రు చేసిందని, తక్షణమే వీటిని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం దిగిరాకుంటే వచ్చే మేలో రాహుల్ గాంధీ విశాఖ మన్యంలో పాదయాత్ర చేస్తారని హెచ్చరించారు. పిసిసి ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక న్యాయ సాధికారత యాత్ర ఏప్రిల్ 5 జగజ్జీవన్ రామ్ జయంతి వరకూ కొనసాగి, కర్నూలులో జరిగే భారీ బహిరంగ సభతో ముగుస్తుందన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని అన్ని ప్రధాన కేంద్రాల్లోను బస్సుయాత్ర కొనసాగుతుందన్నారు. ఏప్రిల్ 15న అంబేద్కర్ జయంతి సందర్భంగా గుంటూరులో సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. కేంద్ర మాజీ మంత్రులు జెడి శీలం, కిల్లి కృపారాణి, రాష్ట్ర మాజీ మంత్రులు కోండ్రు మురళి, ఎస్ శైలజనాథ్, కాసు కృష్ణారావు, పి బాలరాజు, తదితరులు ప్రసంగించారు.