S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/09/2016 - 05:25

విజయవాడ, ఏప్రిల్ 8: తూర్పుతీర ముఖద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గ్ధామమ ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అన్ని విధాలుగా సానుకూలాంశాలున్నాయని..పెట్టుబడులతో తరలిరావాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపుృనిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడు లు పెట్టేవారికి అన్ని విధాలుగా పరిపూర్ణ సహకారం అందిస్తామన్నారు.

04/09/2016 - 05:04

విజయవాడ, ఏప్రిల్ 8: వైకాపాకు చెందిన తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు,నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే సునీల్ శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరికి పసుపు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో ఎనిమిది మంది వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చి చేరడంతో వలస పక్షుల సంఖ్య 10కి చేరుకుంది.

04/09/2016 - 02:05

విజయవాడ, ఏప్రిల్ 8: తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పర్వదినం పరమార్థం జీవితమన్నది సమస్యల సమ్మేళనమని, ఆచితూచి అడుగువేస్తూ ముందుకు వెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉగాది పచ్చడిలో సమ్మిళితంగా ఉండే తీపి, పులుపు, వగరు రానున్న కాలంలో ఎదురయ్యే శుభాశుభాలను తెలియచేస్తాయని అన్నారు. దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలు స్థానిక నేక్ కళ్యాణ మండపంలో శుక్రవారం ఘనంగా జరిగాయి.

04/08/2016 - 16:24

విజయవాడ:ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశాలు ఆసక్తి చూపుతున్నాయని, మున్ముందు భారీగా పెట్టుబడులు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చైనాలోని సించువాన్ రాష్ట్రం ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కాగా ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వాంగ్‌నింగ్, ఏపీ ప్రభుత్వం మధ్య ఈమేరకు అవగాహన ఒప్పందం కుదిరింది.

04/08/2016 - 13:07

హైదరాబాద్, ఏప్రిల్ 7: ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించే కృష్ణా పుష్కరాల సందర్భంగా కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పుష్కర ఘాట్లను నిర్మించేందుకు రూ. 231 కోట్లను విడుదల చేస్తూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లాకు రూ.142 కోట్లు, గుంటూరు జిల్లాకు రూ.65 కోట్లు, కర్నూలు జిల్లాకు రూ.24 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

04/08/2016 - 13:06

వినుకొండ, ఏప్రిల్ 7: మహిళా మావోయిస్టు అన్నపూర్ణ అలియాస్ అరుణక్కను గుంటూరు జిల్లా బొల్లాపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. మండలంలోని రావులాపురంలో బుధవారం జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. గురువారం ఆమెను స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి శ్రీనివాసరావు 14 రోజులు రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.

04/08/2016 - 13:04

హైదరాబాద్, ఏప్రిల్ 7: అర్చకుల సంక్షేమానికి సంబంధించి ఎపి ఎండోమెంట్స్ అర్చకులు, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్ట్ అనేక నిర్ణయాలు తీసుకున్నది. ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు అధ్యక్షతన ఇటీవల బోర్డు సమావేశమై తీసుకున్న నిర్ణయాలను గురువారం విడుదల చేశారు. రాష్ట్రంలోని 15 వేదపాఠశాలలకు 16.10 లక్షల రూపాయలు గ్రాంటుగా ఇస్తూ తీర్మానించారు.

04/08/2016 - 13:01

చిత్తూరు, ఏప్రిల్ 7: చిత్తూరు జిల్లా కోర్టు ఆవరణలో బాంబు పేలుడు ఘటనలో టార్గెట్ చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న చింటూనా లేక చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సికె జయచంద్రారెడ్డి అలియాస్ సికె బాబునా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

04/08/2016 - 13:01

హైదరాబాద్, ఏప్రిల్ 7: జాతీయ స్థాయిలో ర్యాంకులకు దూరంగా ఉండిపోయిన ఆంధ్రప్రదేశ్‌లోని పలు విశ్వవిద్యాలయాలకు అంతర్జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించేందుకు గట్టి ప్రయత్నం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రా యూనివర్శిటీకి అంతర్జాతీయ ఖ్యాతి ఉన్నా ర్యాంకు సాధించుకునే ప్రయత్నం గతంలో ఎన్నడూ చేయలేదు.

04/08/2016 - 13:00

హైదరాబాద్, ఏప్రిల్ 7: వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజాను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానం వ్యవహారంలో సుప్రీంకోర్టు గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.

Pages