ఆంధ్రప్రదేశ్‌

ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి, సర్కారుకు నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజాను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానం వ్యవహారంలో సుప్రీంకోర్టు గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసుపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని, శాసనసభ్యుడిని రాజ్యాంగంలోని 190(3) కింద సస్పెండ్ చేశామని, ఏపి అసెంబ్లీ రూల్స్ 340(2) కింద సస్పెండ్ చేయలేదనే శాసనసభ విభాగం చేసిన వాదనను హైకోర్టు డివిజన్ బెంచి పరిగణనలోకి తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక వైపు సస్పెండైన సభ్యురాలికి ప్రివిలేజ్ కమిటీ నోటీసు ఇవ్వడం, అదే సమయంలో అధికరణ 190 కింద సభ్యురాలిని సస్పెండ్ చేయడాన్ని ఎలా సమర్ధించుకుంటారని బెంచి ప్రశ్నించింది. ఈ కేసులో తొలుత ఎమ్మెల్యే రోజా హైకోర్టు సింగిల్ జడ్జి కోర్టును ఆశ్రయించగా, సస్పెన్షన్‌ను నిలుపుదల చేస్తూ స్టే ఇచ్చింది. అనంతరం హైకోర్టు డివిజన్ బెంచిని ఏపి అసెంబ్లీ ఆశ్రయించగా, స్టేను ఎత్తివేసింది. దీంతో ఎమ్మెల్యే రోజా సుప్రీం కోర్టులో గత వారం పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఏపి అసెంబ్లీప్రివిలేజ్ కమిటీ బుధవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆర్‌కె రోజా హాజరయ్యారు. ప్రివిలేజ్ కమిటీ ఎదుట ఆమె తన వాదనలు వినిపించారు.