ఆంధ్రప్రదేశ్‌

వేద పాఠశాలలకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: అర్చకుల సంక్షేమానికి సంబంధించి ఎపి ఎండోమెంట్స్ అర్చకులు, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్ట్ అనేక నిర్ణయాలు తీసుకున్నది. ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు అధ్యక్షతన ఇటీవల బోర్డు సమావేశమై తీసుకున్న నిర్ణయాలను గురువారం విడుదల చేశారు. రాష్ట్రంలోని 15 వేదపాఠశాలలకు 16.10 లక్షల రూపాయలు గ్రాంటుగా ఇస్తూ తీర్మానించారు. ఎనిమిది వేద/ఆగమ పాఠశాలల్లో వౌలిక సదుపాయాలను కల్పించేందుకు 82 లక్షల రూపాయలను కేటాయించారు. ఉపనయనాలు, వివాహాలు, గృహరుణాలు, వైద్య ఖర్చులు తదితర అవసరాల కోసం 1.96 కోట్ల రూపాయలు కేటాయించారు. 6(ఎ) దేవాలయాల్లో ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీని వీలైనంత త్వరగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గృహనిర్మాణానికి గతంలో యూనిట్ కాస్ట్ 1.50 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ అనుమతించిన గృహాలు వివిధ కారణాల వల్ల పూర్తి కాకపోతే అదనంగా నిధులు ఇవ్వాలని నిర్ణయించారు.
అర్చక సంక్షేమ నిధి ట్రస్ట్‌కు తిరుమల తిరుపతి దేవస్థానాలు (తితిదే) ఇవ్వాల్సిన కంట్రిబ్యూషన్‌ను రాబట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
అర్చకులు ఎవరైనా మరణిస్తే, వారి కుమారుడిని కన్సాలిడేటెడ్ వేతనంపై నియమించాలని నిర్ణయించారు. అర్చక-ఆగమ పరీక్షలకు వయోపరిమితిని రద్దు చేస్తూ నిర్ణయించారు. రెండు లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న ఆలయాల్లో ఉత్సవాల సందర్భంగా అదనంగా హుండీలను ఏర్పాటు చేయవద్దని తీర్మానించారు.