ఆంధ్రప్రదేశ్‌

పుష్కర ఘాట్ల నిర్మాణానికి రూ. 231 కోట్లు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించే కృష్ణా పుష్కరాల సందర్భంగా కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పుష్కర ఘాట్లను నిర్మించేందుకు రూ. 231 కోట్లను విడుదల చేస్తూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లాకు రూ.142 కోట్లు, గుంటూరు జిల్లాకు రూ.65 కోట్లు, కర్నూలు జిల్లాకు రూ.24 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

16న గుంటూరులో కౌలు రైతుల సదస్సు
ఎపి రైతు సంఘం వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 7: ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ చట్టానికి 11 సవరణలతో జివో నెం.425ను జారీ చేయడంతో తలెత్తిన సమస్యలను పరిష్కరించుకునేందుకు గాను ఈ నెల 16న గుంటూరులో కౌలు రైతుల రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నట్లు ఎపి రైతు సంఘం ప్రకటించింది. గుంటూరులోని ఎన్‌జివో కల్యాణ మండపం హాల్‌లో జరిగే ఈ సదస్సుకు దేవాదాయ భూముల కౌలు రైతులంతా హాజరు కావాలని సంఘం అధ్యక్షుడు బి.బలరామ్, ప్రధాన కార్యదర్శి వంగల సుబ్బారావు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్ర వ్యాపిత ఉద్యమ కార్యాచరణను చేపడతామని వెల్లడించారు.

ఎంఆర్‌పిఎస్ రథయాత్రకు
అనుమతి నిరాకరించిన హైకోర్టు

హైదరాబాద్, ఏప్రిల్ 7: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్ధాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారావారిపల్లె నుంచి తలపెట్టిన విశ్వరూప రథయాత్రకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. యాత్ర చేపట్టడం వల్ల శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతుందని పోలీసు శాఖ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఈ తీర్పును జస్టిస్ పివి సంజయ్ కుమార్ వెలువరించారు.