ఆంధ్రప్రదేశ్‌

వర్శిటీలకు ర్యాంకుల కోసం.. ప్రభుత్వం తంటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: జాతీయ స్థాయిలో ర్యాంకులకు దూరంగా ఉండిపోయిన ఆంధ్రప్రదేశ్‌లోని పలు విశ్వవిద్యాలయాలకు అంతర్జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించేందుకు గట్టి ప్రయత్నం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రా యూనివర్శిటీకి అంతర్జాతీయ ఖ్యాతి ఉన్నా ర్యాంకు సాధించుకునే ప్రయత్నం గతంలో ఎన్నడూ చేయలేదు. గత ఏడాది క్యూఎస్ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్‌కు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్‌కు దరఖాస్తు చేసుకున్నా పోటీలో నిలవలేకపోయింది. దానికి కారణం అందుకు అవసరమైన సన్నద్ధతకు వీలుగా యూనివర్శిటీలో పాలనా యంత్రాంగం లేకపోవడమేననేది నిర్వివాదాంశం. ఇదే లోపంతో జాతీయ స్థాయి ర్యాంకింగ్‌లకు సైతం యూనివర్శిటీ అధికారులు సకాలంలో డాటాను పంపించలేకపోయారు. ఆంధ్రాలో నాగార్జున వర్శిటీ, జెఎన్‌టియు అనంతపురం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఎస్వీయుల పరిస్థితి కూడా అదే.
దీనిని అధిగమించి యూనివర్శిటీలకు అంతర్జాతీయ క్రెడిట్స్‌ను సాధించిపెట్టేందుకు ప్రభుత్వం ముగ్గురు కన్సల్టెంట్లను నియమించింది. ప్రాచీ, రాణా, ఆకాశ్ జైన్ అనే ముగ్గురు కన్సల్టెంట్లను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు ఉన్నత విద్యాశాఖలో స్పెషల్ సెల్‌ను నెలకొల్పారు. దీనికి అధిపతిగా జాయింట్ సెక్రటరీ జి.కన్నందాస్‌ను నియమించగా చీఫ్ కోఆర్డినేటర్‌గా జెకెసి శ్రీనివాస్‌ను నియమించారు. కమిషనర్ కార్యాలయంలోని వేణుగోపాల్‌ను కూడా ఈ సెల్‌లో సభ్యుడిగా నియమించారు. వీరంతా కలిసి రానున్న రోజుల్లో ఆంధ్రా యూనివర్శిటీతో పాటు నాగార్జున వర్శిటీ, జెఎన్‌టియుకె, జెఎన్‌టియు అనంతపురం, పద్మావతి మహిళా యూనివర్శిటీ, వెంకటేశ్వర యూనివర్శిటీ, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్శిటీలకు అంతర్జాతీయ ర్యాంకింగ్‌లకు వ్యూహరచనతో పాటు అవసరమైన ప్రక్రియను పూర్తి చేస్తారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా రూపొందించేందుకు కూడా సలహాలను ఇస్తారు.