S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/10/2016 - 06:54

హైదరాబాద్, ఏప్రిల్ 9: ఒడిశా కేడర్ 1986వ, బ్యాచ్‌కు చెందిన ఐపిఎస్ అధికారి ఎం నాగేశ్వర రావు నూతన సిబిఐ జాయింట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. వరంగల్ జిల్లా మంగపేటకు చెందిన నాగేశ్వర రావు సుదీర్ఘకాలంగా భువనేశ్వర్ డెవలప్‌మెంట్ అథారిటీ ఉన్నతాధికారిగా పనిచేశారు. ప్రస్తుతం ఒడిశా కేడర్‌లో అదనపు డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న ఆయన హైదరాబాద్ సిబిఐ జెడిగా పదోన్నతి పొందారు.

04/10/2016 - 06:54

చింతపల్లి, ఏప్రిల్ 9: మావోయిస్టు నేత కుడుమల రవి(38) శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. విశాఖ జిల్లా జికె.వీధి మండలం సప్పర్ల ప్రాథమిక ఆసుపత్రి సమీపంలో రవి అపస్మారక స్థితిలో పడి ఉండగా చూసిన స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యసిబ్బంది ప్రథమ చికిత్స అందించారు.

04/10/2016 - 06:53

హైదరాబాద్, మార్చి 9: ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో అడ్మిషన్లకు మే 15వ తేదీన డీసెట్-2016ను నిర్వహించనున్నారు. అందుకు పరీక్ష ఫీజును చెల్లించేందుకు ఏప్రిల్ 20 వరకూ గడువు ఇచ్చినట్టు సెట్ చైర్‌పర్సన్ కె సంధ్యారాణి, కన్వీనర్ పి పార్వతి తెలిపారు. డీసెట్‌ఎపి డాట్ సిజిజి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌లో అభ్యర్ధులు తమ దరఖాస్తులను పంపించుకోవచ్చని పేర్కొన్నారు.

04/10/2016 - 06:35

వినుకొండ/బొల్లాపల్లి, ఏప్రిల్ 9: గుంటూరు జిల్లా, బొల్లాపల్లి మండలంలోని నెహ్రూనగర్ తండా సమీపంలో ఇద్దరు ఫారెస్ట్ సిబ్బంది దారుణ హత్యకు గురయ్యారు. ఈ దారుణం శనివారం జరిగింది.

04/10/2016 - 06:35

అనంతపురం, ఏప్రిల్ 9 : రాయలసీమలోభానుడి భగభగలు ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. శనివారం అనంతపురంలో సగటు ఉష్ణోగ్రత 40.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా జిల్లా కేంద్రమైన అనంతపురంలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో అత్యధికంగా 44.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

04/10/2016 - 06:34

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శనివారం రాత్రి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయన ఆలయం మహాద్వారం వద్దకు రాగానే టిటిడి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఇఓ డాక్టర్ సాంబశివరావు, తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు స్వాగతం పలికారు. ఠాకూర్ పది నిమిషాలపాటు స్వామిని దర్శించుకున్నారు.

04/10/2016 - 06:30

ఆస్పరి,ఏప్రిల్ 9: కర్నూలు జిల్లా ఆస్పరి మండల పరిధిలోని కైరుప్పుల గ్రామంలో శనివారం పిడకల సమరం అత్యంత ఉత్కంఠగా సాగింది. ఏటా సాంప్రదాయబద్ధంగా జరిగే ఈ పిడకల సమరంలో వీపులు కందిపోయి, తలలకు గాయాలైనా లెక్క చేయకుండా రాసులుగా పోసిన పిడకలన్నీ అయిపోయే వరకు కొట్టుకుంటూ గ్రామస్థులు ఆనందంతో మునిగితేలారు. కైరుప్పులలో వీరభద్రస్వామి కల్యాణోత్సవం సందర్భంగా నిర్వహించే పిడకల సమరానికి చారిత్రక నేపథ్యం ఉంది.

04/10/2016 - 06:29

గుంటూరు, ఏప్రిల్ 9: విభజన చట్టంలో పొందుపర్చిన విధంగా రాష్ట్రానికి 5 లక్షల కోట్ల నిధులు అందించాల్సి ఉండగా కేవలం 5 వేల కోట్ల రూపాయలను మాత్రమే కేంద్రం రాష్ట్ర ప్రజలకు విదిల్చి చేతులు దులుపుకుందని ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి విమర్శించారు. శనివారం గుంటూరు నగరానికి విచ్చేసిన రఘువీరా స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.

04/10/2016 - 06:27

భీమవరం, ఏప్రిల్ 9: రాష్ట్రంలోని పలు పురపాలక సంఘాలను చెత్త సమస్య తీవ్రంగా వేధిస్తోంది. డంపింగ్‌యార్డుల కొరత కారణంగా రోజురోజుకూ పట్టణాల్లో పెరిగిపోతున్న చెత్త పాలకవర్గాలకు, అధికార యంత్రాంగానికి తలపోటుగా పరిణమిస్తోంది. రాష్ట్రంలోని 110 పురపాలక సంఘాల్లో రోజూ 6,444 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. ఈ చెత్తను ట్రాలీలు, మినీ ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు డంప్ చేస్తున్నారు.

04/10/2016 - 06:21

చంద్రగిరి, ఏప్రిల్ 9: తిరుపతి నుంచి చిత్తూరు వెడుతున్న మారుతీ వ్యాన్‌ను ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు పాకాలవారి పల్లెవద్ద ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

Pages