S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/12/2016 - 06:13

భద్రాచలం, ఏప్రిల్ 11: ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వసంత పక్ష నవాహ్నిక తిరుకల్యాణ మహోత్సవ బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి బేల మంటపంలో నూతన స్వర్ణ కవచ ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం చేశారు.

04/12/2016 - 06:09

తిరుపతి, ఏప్రిల్ 11: తండ్రి చనిపోతే టిటిడిలో తనకు ఉద్యోగం వస్తుందన్న ఆశతో తల్లితో కలిసి కన్న తండ్రినే అతి కిరాతకంగా హత్యచేసిన ఓ కూతురి ఘాతుకాన్ని తిరుపతి వెస్ట్‌పోలీసులు ఛేదించారు. వారం రోజుల కిందట విశాఖపట్నం జిల్లా ఉపమాక శ్రీ వేంకటేశ్వరదేవస్థానం విద్యుత్‌శాఖలో వైర్‌మెన్‌గా పనిచేస్తున్న మనోహర్ తిరుపతిలోని తన ఇంటిలో అనుమానాస్పదంగా మృతి చెందాడు.

04/12/2016 - 06:08

విజయవాడ, ఏప్రిల్ 11: నూతన విద్యా సంవత్సరం ఆరంభం నాటికి హైదరాబాద్‌లో ఉన్న ప్రభుత్వ శాఖలన్నింటినీ రాజధాని అమరావతి ప్రాంతానికి తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈలోపుగానే తాత్కాలిక సచివాలయం నిర్మాణం కూడా పూర్తికానుంది. ప్రస్తుతానికి మరికొన్ని కార్యాలయాలను విజయవాడ, గుంటూరులో ఏర్పాటు చేయబోతున్నారు.

04/12/2016 - 06:07

ఖమ్మం, ఏప్రిల్ 11: విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో ఖమ్మం జిల్లా మధిర వద్ద ఓ మహిళ మెడలో నుంచి దుండగుడు బంగారు గొలుసు తెంచుకెళ్లాడు. ఈ సంఘటన సోమవారం తెల్లవారుఝామున జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. తెల్లవారుఝామున 4 గంటల సమయంలో మధిర మండల పరిధిలోని దెందుకూరు వంతెన వద్ద ఓ ఆగంతకుడు నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ను చైన్ లాగి ఆపాడు.

04/12/2016 - 06:06

విశాఖపట్నం, ఏప్రిల్ 11: విశాఖపట్నం జిల్లా నక్కపల్లి సమీపంలోని వెదుళ్లపాలెం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన వారి కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పరామర్శించారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన బుచ్చిరాజుపాలెంలోని బాధిత కుటుంబాలను స్వయంగా కలుసుకుని ఓదార్చారు. జరిగిన దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతులకు నివాళులర్పించారు.

04/12/2016 - 06:02

చీరాల, చినగంజాం, ఏప్రిల్ 11: సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒంగోలు - తెనాలి పాసింజర్ రైలు చినగంజాం స్టేషన్‌లో ప్రయాణికులు దిగిన తరువాత తిరిగి బయల్దేరింది. సోపిరాల గేటు వద్దకు రాగానే రైలు రెండో ఇంజన్‌లో నుంచి ఒక్కసారిగా పొగ రావడం కనిపించింది. దీన్ని గమనించిన పక్క బోగీ లోని ప్రయాణికులు భయంతో కేకలు పెట్టారు. చైను లాగి రైలును నిలిపి వేశారు.

04/12/2016 - 06:01

తిరుమల, ఏప్రిల్ 11: తిరుమలలోని శ్రీవారి పాదాలకు వెళ్లే రోడ్డు మార్గంలో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. శ్రీవారి పాదాల నుంచి వేగంగా వస్తున్న ఓ ఇండికా వాహనం ఎదురుగా వస్తున్న సుమోను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇండికా వాహనంలో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన భాటియా (37) అనే భక్తుడి తలకు బలమైన గాయం కాగా, అతడి కుమార్తెకు స్వల్ప గాయాలు అయ్యాయి.

04/12/2016 - 06:01

పోలవరం, ఏప్రిల్ 11: పోలవరం ప్రాజెక్టు కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ముంపునకు గురవుతున్న గ్రామాల్లో జాతీయ మానవ హక్కుల సంఘం బృందం సోమవారం పర్యటించింది.

04/12/2016 - 06:00

చిత్తూరు, ఏప్రిల్ 11 : మహిళపై అత్యాచారం, దాడి కేసులో ఇద్దరు తమిళనాడు రాష్ట్రానికి చెందిన నిందితులకు 20 ఏళ్ల జైలుశిక్షతో పాటు రెండువేలు జరిమానా విధిస్తూ సోమవారం చిత్తూరు జిల్లా 8వ అదనపు న్యాయమూర్తి సిదానంద తీర్పునిచ్చారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పాతగుంట ఎస్టీ కాలనీకి చెందిన రాజేంద్ర 2013 డిసెంబర్ 16న తనకు పరిచయం ఉన్న వివాహితతో కలిసి పెనుమూరు మండలం రామకృష్ణాపురం వద్దకు వచ్చారు.

04/12/2016 - 05:59

తిరుమల, ఏప్రిల్ 11: నోయిడాకు చెందిన లోహియా ఆటో మొబైల్ సంస్థ తయారుచేసిన 3లక్షల 15 వేల రూపాయలు విలువచేసే రెండు ఆటోలను సోమవారం ఆ సంస్థ యజమాని ఆయుష్ లోహియా శ్రీవారికి విరాళంగా ఇచ్చారు. ఆలయం ముందు ఈ ఆటోలను రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, టిటిడి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అందుకుని టిటిడి ట్రాన్స్‌పోర్ట్ విభాగం డిఐ భాస్కర్‌నాయుడుకు అందించారు.

Pages