ఆంధ్రప్రదేశ్‌

ఉద్యోగం కోసంతండ్రిహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 11: తండ్రి చనిపోతే టిటిడిలో తనకు ఉద్యోగం వస్తుందన్న ఆశతో తల్లితో కలిసి కన్న తండ్రినే అతి కిరాతకంగా హత్యచేసిన ఓ కూతురి ఘాతుకాన్ని తిరుపతి వెస్ట్‌పోలీసులు ఛేదించారు. వారం రోజుల కిందట విశాఖపట్నం జిల్లా ఉపమాక శ్రీ వేంకటేశ్వరదేవస్థానం విద్యుత్‌శాఖలో వైర్‌మెన్‌గా పనిచేస్తున్న మనోహర్ తిరుపతిలోని తన ఇంటిలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. భర్తది సహజ మరణమని చిత్రీకరించి దహన సంస్కారాలు చేయడానికి భార్య, బిడ్డలు ప్రయత్నించారు.
మనోహర్‌ది సహజ మరణం కాదని, ఆత్మహత్య కాదని, హత్యేనని మృతుడి సోదరుడు భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. తీవ్రగాయాలతో మృతి చెందినట్లు తేలింది. దీంతో మృతుడు భార్య శారద, పెద్ద కూతురు పావని, బిటెక్ చదివిన చిన్న కూతురు శిరీషను, వీరి మేనమామ బాబును పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. పెద్ద కూతురు పావనికి వివాహం కాగా, బిటెక్ పూర్తి చేసుకుని ఖాళీగావున్న శిరీషకు ఉద్యోగం కల్పించాలని స్వచ్ఛంద పదవీవిరమణ తీసుకోవాలని భార్య శారద భర్త మనోహర్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చింది.
ఈసమయంలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేయాలని తల్లీకూతుళ్లు మనోహర్‌తో ఘర్షణ పడేవారు. ఈ క్రమంలోనే ఈనెల 4న మనోహర్ తిరుపతిలో తాను నివాసం ఉంటున్న నెహ్రూనగర్‌కు వచ్చాడు. ఈ సమయంలోనే వారి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపధ్యంలో రోకలి, బండరాయిని ఉపయోగించి తల్లీకూతుళ్లు మనోహర్‌పై దాడి చేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో చుట్టపు చూపుగా వచ్చిన పావని, శారద తమ్ముడు బాబు కూడా ఇంట్లో ఉన్నారు. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారు. వెస్ట్ పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకుని విచారించి ఇది తల్లీ కూతుళ్లు చేసిన హత్యేనని నిర్ధారించారు. ఇందులో భాగంగా మనోహర్ భార్య, ఇద్దరు కూతుళ్లు, బావమరిదిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిననట్లు వెస్ట్ డిఎస్పీ విలేఖరులకు తెలిపారు.