ఆంధ్రప్రదేశ్‌

పాసింజర్ రైలులో పొగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, చినగంజాం, ఏప్రిల్ 11: సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒంగోలు - తెనాలి పాసింజర్ రైలు చినగంజాం స్టేషన్‌లో ప్రయాణికులు దిగిన తరువాత తిరిగి బయల్దేరింది. సోపిరాల గేటు వద్దకు రాగానే రైలు రెండో ఇంజన్‌లో నుంచి ఒక్కసారిగా పొగ రావడం కనిపించింది. దీన్ని గమనించిన పక్క బోగీ లోని ప్రయాణికులు భయంతో కేకలు పెట్టారు. చైను లాగి రైలును నిలిపి వేశారు. వెంటనే అప్రమత్తమైన స్టేషన్ అధికారులు రైలు డ్రైవర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో డ్రైవర్ రైలును ప్లాట్‌ఫాం పైకి తెచ్చాడు. అందులో ప్రయాణిస్తున్న వారు రైలు దిగి దూరంగా వెళ్లిపోయారు. అప్పటికే ఇంజన్ నుంచి పొగలు దట్టంగా వ్యాపించాయి. ఆ ఇంజన్‌ను రైలు నుంచి విడగొట్టి దూరంగా తీసుకెళ్లారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. సాంకేతిక లోపం వల్ల పొగలు వచ్చాయని స్టేషన్ మాస్టర్ రహంతుల్లా తెలిపారు.