S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/10/2016 - 06:19

చిత్తూరు, ఏప్రిల్ 9: చైనా దేశానికి చెందిన ఎర్రచందనం స్మగ్లరు లిన్ డాంగ్ ఫూ(42)ను చిత్తూరు టాస్క్ ఫోర్సు బలగాలు శుక్రవారం అరెస్టు చేశాయి. జిల్లా ఎస్పి శ్రీనివాస్ కథనం మేరకు ఇటీవల చిత్తూరు తాలుకా పోలీసు స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా చిత్తూరు జిల్లా యల్లమందకు చెందిన ఎర్రచందనం అక్రమ రవాణాలో పైలెట్‌గా ఉన్న ప్రసాద్‌ను అరెస్టు చేశామన్నారు.

04/09/2016 - 18:00

చిత్తూరు:ప్రతి ఇంటికి 15 ఎంబిపిఎస్ సామర్థ్యంతో ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తామని, మూడు ఫోన్లను అందజేస్తామని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లాలో నీరు-చెట్టు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

04/09/2016 - 14:58

విశాఖ:విశాఖ జిల్లా కొయ్యూరు మండలం గోమంగి గ్రామానికి చెందిన మావోయిస్టు కీలక నేత కుడుముల రవి మరణించారు. కొద్దికాలంగా కామెర్లతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రజాగెరిల్లా ఆర్మీ ప్లటూన్ కమాండర్‌గా వ్యవహరించిన రవి మరణం మావోయిస్టు పార్టీకి తీరనినష్టం.

04/09/2016 - 14:58

విజయవాడ:తెలంగాణ, ఆంథ్రప్రదేశ్‌లలో మెడికల్ పీజి అడ్మిషన్ల కౌన్సిలింగ్‌ను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని, దీనికి సంబంధించి షెడ్యూల్ ఖరారు చేసినట్లు ఎన్టీఆర్ హెల్త్‌యూనివర్శిటీ పేర్కొంది.

04/09/2016 - 12:13

న్యూదిల్లి:ఆంధ్రప్రదేశ్‌లో తీరంవెంబడి నిర్మించనున్న అనేక ప్రాజెక్టులకు సంబంధించిన ‘సాగరమాల’పై న్యూదిల్లీలో సమావేశం ప్రారంభమైంది. కేంద్రమంత్రి నితిన్‌గడ్కర్ సమక్షంలో, రాష్టమ్రంత్రి అచ్చెన్నాయుడు, అధికారులతో ఈ ప్రాజెక్టుపై సుదీర్ఘచర్చ జరిగింది.

04/09/2016 - 12:12

గుంటూరు:గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం, నెహ్రూనగర్ తాండాలో ఇద్దరు అటవీశాఖ బీట్ ఆఫీసర్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపారు. కలప తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో నల్లమల అడవుల్లోకి వెళ్లిన ఈ ఇద్దరిపై దుండగులు కిరాతకంగా దాడి చేసి హతమార్చారు. మృతులను బీట్ ఆఫీసర్లు షేక్‌బాజి సాహిద్, డిడ్లా లాజర్‌లుగా గుర్తించారు.

04/09/2016 - 12:12

అనంతపురం: నిద్రిస్తున్న కార్మికులపైకి లారీ దూసుకువెళ్లిన సంఘటనలో నలుగురు మరణించారు. అనంతపురం జిల్లా శెట్టూరు మండలం పర్లచేడులో శుక్రవారం తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది.

04/09/2016 - 08:52

విజయవాడ, ఏప్రిల్ 8: చంద్రబాబు మనుమడు, లోకేష్ కుమారుడు దేవాన్ష్ తొలి పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం రాత్రి విజయవాడ నగరంలో ఘనంగా జరిగాయి. ఆంగ్ల కాలమానం ప్రకారం దేవాన్ష్ మార్చి 21న జన్మించాడు. తెలుగు తిథి ప్రకారం ఉగాది రోజున జన్మించాడు. కాబట్టి ఉగాది రోజునే దేవాన్ష్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించాలని భావించిన చంద్రబాబు నాయుడు స్థానిక ఎ కనె్వన్షన్ హాల్‌లో భారీ ఎత్తున విందు ఇచ్చారు.

04/09/2016 - 08:51

విజయవాడ, ఏప్రిల్ 8: వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కళారత్న-హంస, ఉగాది పురస్కారాలను అందచేసింది. స్థానిక నాక్ కళ్యాణ మండపంలో శుక్రవారం కన్నుల పండువగా జరిగిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పురస్కారాలను అందచేశారు. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా అత్యంత ప్రతిష్ఠాకరమైన కళారత్న పురస్కారాలను ప్రవేశపెట్టింది.

04/09/2016 - 08:37

విజయవాడ, ఏప్రిల్ 8: ఎనర్జీ మిగులు ద్వారా వ్యవసాయ గృహ వౌలిక వసతుల కల్పన రంగాల్లో విప్లవాత్మక చర్యలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఇంధన సమర్థ సేవలు చివరి వినియోగ వ్యక్తి వరకు చేర్చడం ద్వారా ఇంధన సంస్థాగత వినియోగాన్ని క్రమబద్దీకరించబోతుంది. దేశంలో ఆంధ్రప్రదేశ్ ఇందుకు అనువైన వేదికగా ఇఇఎస్‌ఎల్ గుర్తించింది.

Pages