S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/07/2016 - 08:28

విజయవాడ, ఏప్రిల్ 6: ప్రస్తుతం రాజకీయం అంతా యువరాజు లోకేష్ చుట్టూ తిరుగుతోంది. యువరాజ పట్ట్భాషేక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించకపోయినా, ఆయన పట్ట్భాషేకం కోసం పార్టీ అంతా వేచి చూస్తోంది. ఆయనను ఎమ్మెల్యేగానో, ఎమ్మెల్సీగానో గెలిపించేందుకు చాలా మంది తమతమ నియోజకవర్గాలను వదులుకోడానికి కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిద్ధపడుతున్నారు.

04/07/2016 - 08:11

విజయవాడ, ఏప్రిల్ 6: కులాల మధ్య చిచ్చు రగిల్చి, ప్రభుత్వాన్ని ఇబ్బందిపాలు చేయడం మంచిది కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లడుతూ ఎన్నో కష్టాల మధ్య ప్రభుత్వాన్న నడుపుతున్నామన్న విషయాన్ని బాధ్యత గల అంతా గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

04/07/2016 - 08:11

విజయవాడ, ఏప్రిల్ 6: పత్యేక హోదా దగ్గర నుంచి అనేక అంశాల్లో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని చంద్రబాబు నాయుడు తీవ్రంగా తప్పుపట్టారు. విభజన హామీలు అమలులో కేంద్రం చేస్తున్న తాత్సారంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా, విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో కేంద్రం ముందుకు రావడం లేదు.

04/07/2016 - 08:03

సూళ్లూరుపేట, ఏఫ్రిల్ 6: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్ ) ను బుధవారం నాసా చీఫ్ (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) ఛార్లెస్ ఎఫ్ బొల్డాన్ సందర్శించారు. చెన్నై నుంచి రోడ్డు మార్గాన ఆయన షార్‌కు చేరుకొన్న ఆయనకు మొదటి గేటు వద్ద షార్ డైరెక్టర్ కున్హికృష్ణన్‌తో పాటు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

04/07/2016 - 08:01

హైదరాబాద్, ఏప్రిల్ 6: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి మరో రెండు నెలల్లో రెండు సంవత్సరాలు కావస్తున్నా, ఇంతవరకు 9,10 షెడ్యూళ్లలోని వందకుపైగా సంస్థల విభజన కొలిక్కి రాలేదు. దీంతో ప్రభుత్వ రంగ సంస్థల విభజన ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. కేంద్ర హోంశాఖ కూడా ఇరు రాష్ట్రాలు ఈ రెండు షెడ్యూళ్లలోని సంస్థల విభజనను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది.

04/07/2016 - 04:10

హైదరాబాద్, ఏప్రిల్ 6: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. ఉగాది తర్వాత ఏ రోజైనా మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ విస్తరణలో 8 మందికి అవకాశం దక్కుతుందని సమాచారం. అయితే ఇటీవల వైకాపా నుండి టిడిపిలో చేరిన 9 మందిలో ఒక్కరికి మాత్రమే అవకాశం ఇస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

04/07/2016 - 01:17

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 6: సుప్రసిద్ధ జ్యోతిష, వాస్తు పండితులు, రాష్టప్రతి అవార్డు గ్రహీత మహామహోపాధ్యాయ మధుర కృష్ణమూర్తిశాస్ర్తీ బుధవారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం కృష్ణనగర్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 88 ఏళ్ల మధుర కృష్ణమూర్తిశాస్ర్తీకి భార్య, ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ముక్కామలలో 1928 ఫిబ్రవరి 28న జన్మించారు.

04/07/2016 - 01:02

విజయవాడ, ఏప్రిల్ 6: జూన్ లోగా హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చే ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని దినాల సౌకర్యం కల్పిస్తామని మున్సిపల్ మంత్రి నారాయణ తెలియచేశారు. ఉద్యోగుల తరలింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బుధవారం నారాయణ చర్చించారు. ఆ తరువాత ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వారానికి ఐదు రోజుల పనిదినాలను ఏవిధంగా అమలు చేయాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు.

04/07/2016 - 01:00

హైదరాబాద్, ఏప్రిల్ 6: ‘ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కె రోజా అసెంబ్లీ ప్రివిల్లేజస్ (సభా హక్కుల ఉల్లంఘన) కమిటీ ముందు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 18న అసెంబ్లీలో జరిగిన ఘటన నేపథ్యంలో ఆమెను సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

04/06/2016 - 18:01

కడప: అదనపు కట్నం కోసం భర్త, అత్తింటి వారు తరచూ వేధించడంతో విసిగి వేసారిన కోడలు భర్త ఇంటి వద్ద బైఠాయించి ఆందోళన ప్రారంభించింది. రాజంపేట గాజులవీధిలో ఈ ఘటన బుధవారం జరిగింది. పోస్టల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న అమర్‌నాథ్‌తో బాధితురాలు ప్రియాంకకు రెండేళ్ల క్రితం పెళ్లయింది. తర్వాత కొద్దిరోజులకే అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు, ఆడపడుచు ఆమెను కొట్టడం ప్రారంభించారు.

Pages