S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/11/2016 - 12:02

విశాఖ: పారిశ్రామిక ప్రాంతమైన షీలానగర్‌లో కార్మికుల ప్రయోజనార్థం నిర్మించే ఇఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణాలకు సోమవారం ఉదయం ఎపి సిఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. సుమారు 500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తారు. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, వెంకయ్య నాయుడు, పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

04/11/2016 - 12:02

విజయవాడ: కృష్ణా జిల్లా గూడూరు మండలం కంకటాల గ్రామం వద్ద సోమవారం ఉదయం ఓ గుడిసెపైకి పొక్లెయిన్ దూసుకురావడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

04/11/2016 - 07:58

జమ్మలమడుగు, ఏప్రిల్ 10: కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీమంత్రి రామసుబ్బారెడ్డి వర్గీయులపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు ఆదివారం సాయంత్రం దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జమ్మలమడుగు మండలం పెద్దండ్లూరు గ్రామంలో చోటుచేసుకుంది. రామసుబ్బారెడ్డి ఆదివారం రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడుతో కలిసి పెద్దండ్లూరు, సిరిగేపల్లెలో జరుగుతున్న జాతర ఉత్సవాలకు వెళ్లారు.

04/11/2016 - 05:52

విశాఖపట్నం, ఏప్రిల్ 10: విశాఖ జిల్లా నక్కపల్లి సమీపం వెదుళ్లపాలెం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి తుని సమీపంలోని తలుపులమ్మతల్లి అమ్మవారి దర్శనానికి కారులో వెళ్తున్న 9 మందితో పాటు రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మరో ఇద్దరు ఈ ప్రమాదంలో మరణించారు.

04/11/2016 - 05:37

పీలేరు, ఏప్రిల్ 10: చిత్తూరు జిల్లా పీలేరు మండలం మేళ్లచెరువు గ్రామం మిధులానగరానికి చెందిన సునీత తన ఇద్దరు కూతుళ్లతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలే ఆమె ఆత్మహత్యకు కారణమని స్థానికులు అంటున్నారు. మునిశేఖర్ భార్య సునీత (28), యశ్వని (8), నవ్య (6) మేళ్లచెరువు గ్రామం మిధులానగర్‌లో నివాసముంటున్నారు. ఆదివారం సునీత తన ఇద్దరు పిల్లలతో వెళ్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

04/11/2016 - 05:36

అనంతపురం/విశాఖ, ఏప్రిల్ 10: రాయలసీమలో భానుడు తన ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు. ప్రతి రోజూ 40 డిగ్రీల సెల్సియస్‌కు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. అనంతపురం జిల్లాలో సగటు ఉష్ణోగ్రత 40.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా జిల్లా కేంద్రంలో 40.4, బుక్కపట్నం మండలంలో అత్యధికంగా 44.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

04/10/2016 - 18:16

విజయవాడ:వెనుకబడిన కాపు సామాజిక వర్గంలో పేదలకు మాత్రమే తాము రిజర్వేషన్లు కోరుతున్నామని కాపునేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన కాపు ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. పరీక్షల దృష్ట్యా తన దీక్ష వాయిదా వేసుకున్నానని, ఆ నిర్ణయంలో వెనుకకు పోలేదని తేల్చిచెప్పారు.

04/10/2016 - 17:05

విశాఖపట్నం: జిల్లాలోని నక్కపల్లివద్ద జాతీయ రహదారిపై ఓ కారు, లారీ, మోటార్‌బైక్ ఢీకొన్న సంఘటనలో పదకొండు మంది మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తునినుండి వస్తున్న కారు అతివేగంగా వస్తూండగా టైరు పంచర్ అవడంతో అదుపుతప్పి జాతీయరహదారిపై రెండోవైపు లైన్‌లోకి దూసుకువెళ్లింది. అక్కడ వెడుతున్న ఓ బైక్‌ను ఢీకొట్టి దానిని ఈడ్చుకుంటూ వెళ్లి ఓ లారీని వెనుకనుండి ఢీకొట్టింది.

04/10/2016 - 06:56

హైదరాబాద్, ఏప్రిల్ 9: అమర్‌నాథ్ యాత్ర తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్ద సవాలుగా మారింది. ఈ ఏడాది యాత్రకు సమగ్ర మెడికల్ సర్ట్ఫికెట్ తప్పనిసరి చేయడం, జంటనగరాల్లో కేవలం ఆరుగురు ప్రభుత్వ వైద్యుల పేర్లను మాత్రమే బోర్డులో చేర్చడంతో యాత్రికుల కష్టాలు అలవికానివిగా మారాయి. ఉస్మానియా ఆస్పత్రికి చెందిన ముగ్గుర్ని, గాంధీ ఆస్పత్రికి చెందిన ముగ్గుర్ని అధీకృత వైద్యులుగా అమర్‌నాథ్ యాత్రా బోర్డు గుర్తించింది.

04/10/2016 - 06:56

గజపతినగరం, ఏప్రిల్ 9: ఓ వ్యక్తి మలద్వారంలోకి బలవంతంగా ఖాళీ బీరుబాటిల్ జొప్పించిన సంఘటన విజయనగరం జిల్లా గజపతినగరంలో శనివారం జరిగింది. బాధితుడి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం రాయగడకు చెందిన కమరుద్దీన్‌ఖాన్(45) గజపతినగరంలో రైల్వే ట్రాక్‌మిషన్‌లో పనిచేసే సిబ్బంది వద్ద వంటమనిషిగా చేరాడు. 15 రోజుల క్రితం ఇతడు గజపతినగరం వచ్చాడు.

Pages