ఆంధ్రప్రదేశ్‌

టార్గెట్ చింటూనా...సికె బాబునా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఏప్రిల్ 7: చిత్తూరు జిల్లా కోర్టు ఆవరణలో బాంబు పేలుడు ఘటనలో టార్గెట్ చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న చింటూనా లేక చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సికె జయచంద్రారెడ్డి అలియాస్ సికె బాబునా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గురువారం ఉదయం 11.30 గంటలకు కడప జైలు నుంచి కేసు వాయిదా నిమిత్తం చింటూ చిత్తూరు కోర్టుకు వచ్చిన 40నిమిషాల అనంతరం జిల్లా సెషన్స్‌కోర్టు ఎదురుగా బాంబు పేలుడు జరిగింది. దీంతో 1వ అదనపు సెషన్స్‌కోర్టు వద్ద వాయిదా నిమిత్తం వచ్చిన చింటూతోపాటు మరోఇద్దరు అనుచరులను హుటాహుటిన పోలీసులు చుట్టుముట్టి అక్కడి నుంచి తరలించారు. గత ఏడాది నవంబర్ 17న చిత్తూరు నగర మేయర్ కఠారి అనూరాధ, ఆమె భర్త మోహన్ కార్పొరేషన్ కార్యాలయంలోనే దారుణ హత్యకు గురైన సంఘటన తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు చింటూతోపాటు మరో 22 మందిపై పోలీసులు కేసు నమోదుచేసి అరెస్ట్‌చేసారు. ఈ క్రమంలో పలుసార్లు కడప జైలులో ఉన్న చింటూను వాయిదా నిమిత్తం చిత్తూరు కోర్టుకు తీసుకురావడం పరిపాటిగా మారింది. అయితే దీనిని ఆసరాగా తీసుకొని చింటూను టార్గెట్‌గా చేసుకొని బాంబును పేల్చినట్టు అనుమానం వ్యక్తమవుతున్నాయి. 2007లో చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సికె బాబుపై హత్యాయత్నం జరిగింది. తుపాకులతో కాల్చడంతో సికె బాబు తప్పించుకోగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో చింటూ నిందితుడుగా పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ కేసు వాయిదా నిమిత్తం చింటూ గురువారం చిత్తూరు కోర్టుకు పోలీసులు తీసుకు వచ్చారు. ఈ క్రమంలో ఈ ఘటన జరగడం కలకలం రేపించింది. అయితే చింటూ ఒకటవ అదనపు సెషన్స్‌కోర్టు వద్ద వాయిదా కోసం వేసి ఉండగా జిల్లా సెషన్స్ కోర్టు సమీపంలో బాంబు పేలడం గమనార్హం. ఇదిలా ఉండగా ఒక కేసు నిమిత్తం చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సికె బాబు కూడా కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన హాజరు కాకపోగా ఆయన అనుచరులు హాజరైయ్యారు. ఈ క్రమంలో దుండగుల టార్గెట్ చింటూనా..లేక సికె బాబునా అన్నది అంతుపట్టని విషయం. అయితే దుండగులు కోర్టుకు హాజరయ్యే ఇతర కక్షిదారులను మట్టుపెట్టేందుకు ఏమైనా పన్నాగం పన్నారా లేక భయభ్రాంతులకు గురి చేయడానికి ఈ ఘటనకు పాల్పడ్డారన్న విషయాన్ని పోలీసులు నిర్దారించాల్సిందే. అయితే అతి స్వల్ప గన్‌పౌడర్‌తో తయారు చేసిన బాంబును రిమోట్ ద్వారా పేల్చడం దుండగుల ఉద్దేశం అంతుపట్టని వైనంగా మారింది. ఇదిలా ఉండగా దుండగులు గన్‌పౌడర్, రిమోట్‌ను ఎక్కడ సేకరించారని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.