S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/16/2016 - 14:35

హైదరాబాద్‌: ఏపీలో అన్ని పరీక్షలు ఇక ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని, ముందుగా కొన్ని నమూనా పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణపై కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అక్టోబర్‌ 15న డిజిటల్‌ క్లాస్‌రూంల ఏర్పాటు, ప్రతిభా అవార్డుల ప్రదానం ఉంటుందని, ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలను జంబ్లింగ్‌ పద్దతిలోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

09/16/2016 - 12:49

శ్రీకాకుళం: రెండు రోజులుగా కురుస్తున్న వానలతో వంశధార, నాగావళి నదులు జలకళను సంతరించుకున్నాయి. మరో రెండు రోజులు ఇదే విధంగా వర్షాలు పడితే వంశధార పూర్తిగా నిండుతుందని అధికారులు తెలిపారు. హిర మండలంలోని గొట్టా బ్యారేజ్, మడ్డువలస రిజర్వాయర్లకు వరద ఉధృతి పెరిగింది. మడ్డువలసలో 7 వేల క్యూసెక్కుల నీరు చేరింది. దీంతో నాలుగు గేట్లు ఎత్తివేసి నీటిని వదులుతున్నారు.

09/16/2016 - 12:46

గుంటూరు : గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ విజయానికి కార్యకర్తలు సిద్ధం కావాలని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. టీడీపీ నేతలతో ఆయనశుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, డిసెంబర్‌లోగా గుంటూరు కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని,
ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి పార్టీ విజయానికి కృషి చేసి కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్నారు.

09/16/2016 - 12:42

అనంతపురం : గూళ్యపాళ్యంలో చిరుత సంచారంకలకలం సృష్టిస్తోంది. గూళ్యపాళ్యం గ్రామ సమీపంలోని ఓ కొండపై కూర్చుని ఉన్న చిరుతను శుక్రవారం కొందరు గ్రామస్థులు గమనించారు. గ్రామస్థులంతా చిరుతను చూసేందుకు ఎగబడ్డారు. చిరుత సంచారం సమాచారంతో అటవీశాఖ అధికారులు బోను తీసుకుని గూళ్యపాళ్యం చేరుకున్నారు.

09/16/2016 - 12:39

విశాఖపట్నం: వర్షాలతో విశాఖ ఏజెన్సీలో కేకేలైన్‌లో శుక్రవారం కొండచరియలు విరిగిపడ్డాయి. శివలింగాపురం, తైడా స్టేషన్ల మధ్య ట్రాక్‌పై కొండచరియలు పడ్డాయి. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఓహెచ్‌సీ లైన్లు దెబ్బతిన్నాయి. రైల్వే సిబ్బంది ట్రాక్‌ను మరమ్మతు చేసి, ఓహెచ్‌సీ లైన్లు పునరుద్దరించే పనులను చేపట్టారు.

09/16/2016 - 12:37

అనంత‌పురం: అనంతపురం వినాయక్ నగర్ కాలనీలో సికెందర్ దంపతుల కుమారులు మహమ్మద్ ఇదురీష్, మహమ్మద్ జునేద్ డెంగ్యూ జ్వరంతో గురువారం రాత్రి మృతి చెందారు. ఆదివారం ఇద్దరు పిల్లలకు ఒకేసారి జ్వరం రావడంతో డెంగ్యూ జ్వరంగా వైద్యులు నిర్దారించారు. అప్పటికే పరిస్థితి విషమించడం, ఇద్దరు చిన్నారులకు ఫిట్స్ కూడా రావడంతో బెంగ‌ ళూరు ఆసుపత్రికి తరలించాలని అనంతపురం వైద్యులు సిఫార్సు చేశారు.

09/16/2016 - 07:24

తిరుపతి, సెప్టెంబర్ 15: ఆంధ్ర రాష్ట్రం బాగుపడడం ఇష్టం లేకనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజీలతో ప్రజల అభిష్టాన్ని కాలరాసిందని సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, సిపిఎం కార్యదర్శి కుమార్ రెడ్డి, వైఎస్సార్ సిపి తిరుపతి ఎంపి వరప్రసాద్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా ఆరోపించారు.

09/16/2016 - 07:23

విశాఖపట్నం, సెప్టెంబర్ 15: పట్టణీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా విశాఖలో జరుగుతున్న 3వ బ్రిక్స్ అర్బనైజేషన్ ఫోరం సమీక్ష విజయవంతంగా సాగుతోందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి బి ఆనంద్ పేర్కొన్నారు.

09/16/2016 - 07:22

విజయవాడ, సెప్టెంబర్ 15: రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా డూండీ గణేష్ సేవా సమితి వరుసగా రెండోదఫా స్థానిక ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రాంగణంలో గతం కంటే 9 అడుగులు ఎత్తున మొత్తం 72 అడుగుల్లో ప్రతిష్ఠింపబడిన సిద్ది బుద్ది సమేత కైలాస మహాగణపతిని గురువారం రాత్రి ఎంతో కనుల పండువగా నిమజ్జనం జరిగింది.

09/16/2016 - 07:21

శ్రీకాకుళం, సెప్టెంబర్ 15: డెంగ్యూ జ్వరాల తీవ్రతను స్వయంగా తెలుసుకునేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు.

Pages