ఆంధ్రప్రదేశ్‌

సమస్యలకు శాశ్వత పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 15: పట్టణీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా విశాఖలో జరుగుతున్న 3వ బ్రిక్స్ అర్బనైజేషన్ ఫోరం సమీక్ష విజయవంతంగా సాగుతోందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి బి ఆనంద్ పేర్కొన్నారు. గురువారం జరిగిన సదస్సు రెండో రోజు సమీక్షల అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పట్టణీకరణ వల్ల చోటుచేసుకుంటున్న ఇబ్బందులు, వసతుల కల్పన, నిధుల లభ్యత, గృహ నిర్మాణం, స్మార్ట్‌సిటీల నిర్మాణం తదితర అంశాలపై రెండో రోజు సమీక్షలో చర్చించామన్నారు. జన జీవనానికి అనువైన నగరాల నిర్మాణం జరగాలని, నగరాల నిర్మాణంలోనే వౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలని పలువురు సూచించారన్నారు.అలాగే నగరాల్లో వౌలిక వసతుల కల్పనకు నిధుల అవసరం, వాటి లభ్యత వంటి అంశాలపై కూడా కీలక చర్చ జరిగిందన్నారు. స్మార్ట్‌సిటీల్లో వౌలిక సదుపాయాల కల్పనకు నిధుల సమీకరణపై జరిగిన చర్చలో కీలక అభిప్రాయాలు వెల్లడయ్యాయని పేర్కొన్నారు. దీనికోసం పెట్టుబడులను ఆకర్షించాలని అందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించుకోవాలని నిర్ణయించారు. నగర పాలికల్లో ఆదాయ వనరులను పెంచుకునేందుకు వీలుగా సేవలను విస్తృతపరచడం, ఆస్తుల మదింపు చేపట్టడం వంటి చర్యలు అవసరమని అన్నారు. బాండ్ల జారీ, ప్రభుత్వ గ్యారెంటీ వంటి అంశాలు చర్చకు వచ్చాయన్నారు. పట్టణాల్లో గృహ నిర్మాణం, తాగునీరు, ఘన వ్యర్థాల నిర్వహణ, సమగ్ర రవాణా వ్యవస్థ వంటి రంగాల్లో కీలక మార్పులు రావాలని, ఈ సేవల పట్ల పౌరులకు సంతృప్తి కలిగించాలని నిర్ణయించారు.

విలేఖరులతో మాట్లాడుతున్న బి ఆనంద్