S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/15/2016 - 07:20

హైదరాబాద్, సెప్టెంబర్ 14: ఆంధ్రప్రదేశ్‌లో ఏజన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం సమీక్ష నిర్వహించారు. గురువారం రాష్ట్రంలోని మంత్రులు ఆయా జిలాల్లో విషజ్వరాలపై సమీక్షించనున్నారు. వైద్య ఆరోగ్య మంత్రి, సాంఘిక సంక్షేమ మంత్రితో పాటు వైద్య బృందాలను గిరిజన ప్రాంతాలకు తరలి వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సంచార వైద్య వాహనాలను విషజ్వరాలు ప్రబలిన ప్రాంతాలకు పంపాలని అన్నారు.

09/15/2016 - 07:20

గుంటూరు, సెప్టెంబర్ 14: రాష్ట్రంలో రేషన్ దుకాణానికి రాలేని వారికి జన్మభూమి కమిటీల ద్వారా ‘మీ ఇంటికి- మీ రేషన్’ కార్యక్రమంలో ఇళ్లవద్దకే నిత్యావసరాలను తెచ్చి అందించనున్నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. బుధవారం సచివాలయం మూడవ బ్లాక్ ఫస్ట్ఫో్లర్‌లో మంత్రి పేషీని, పౌరసరఫరాల కార్యాలయాన్ని స్ర్తి, శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాతతో కలసి ఆమె ప్రారంభించారు.

09/15/2016 - 07:17

విశాఖపట్నం, సెప్టెంబర్ 14: సినీ నటుడు ఎం.మోహన్‌బాబు సినీ నట జీవితంలో 40 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నవరస నట తిలకం బిరుదుతో సత్కరిస్తున్నట్టు రాజ్యసభ సభ్యులు టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. బుధవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంలో ప్రతి ఏడాది కళాకారులకు సత్కరించే సంప్రదాయం ఉందన్నారు. ఈసారి మోహన్‌బాబుకు ఈ బిరుదుతోపాటు ఘనంగా సత్కరిస్తామన్నారు.

09/15/2016 - 07:09

విశాఖపట్నం, సెప్టెంబర్ 14: దేశంలో స్మార్ట్ సిటీల నిర్మాణం వేగవంతం చేస్తున్నామని, తొలి దశలో ప్రకటించిన స్మార్ట్‌సిటీలకు అనుబంధంగా కేంద్రం మరో 27 పట్టణాలను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు వెల్లడించారు.

09/15/2016 - 07:08

విశాఖపట్నం, సెప్టెంబర్ 14: తాను నిత్య విద్యార్థినని, తనకు అన్నీ తెలుసునని భావించడం పతనావస్థకు ప్రారంభమని విద్యార్థులకు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖలో ఎయు సైన్సు కళాశాల దినోత్సవంలో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తాను అనునిత్యం విద్యార్థిగా వివిధ అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తానని తెలిపారు.

09/15/2016 - 07:07

విశాఖపట్నం, సెప్టెంబర్ 14: రక్షణ రంగ పరిశ్రమలు నెలకొల్పేందుకు ఎపిలో అపారమైన అవకాశాలున్నాయని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రక్షణ రంగ పరిశ్రమలు - ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానం అంశంపై గత రెండు రోజులుగా విశాఖలో జరుగుతున్న ఇండో-రష్యా ద్వైపాక్షిచ చర్చలో పాల్గొన్నారు.

09/15/2016 - 05:09

హైదరాబాద్, సెప్టెంబర్ 14: అధికారికంగా తెలుగు భాష అమలుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. రానున్న రోజుల్లో శిలాఫలకాలు, శంకుస్థాపన- ప్రారంభోత్సవ నామ ఫలకాలు తప్పనిసరిగా తెలుగులో ఉండేలా ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం 11వ ఉత్తర్వులను జారీ చేసింది.

09/15/2016 - 05:08

హైదరాబాద్, సెప్టెంబర్ 14: ఏపి మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుల సమీకరణలతో కసరత్తు చేస్తున్నారు. బాబుకు సెంటిమెంటయిన దసరా రోజునే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా ఆయా కులాలకు ఉన్న ప్రాధాన్యం ప్రకారం కేబినెట్‌ను విస్తరించాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం.

09/15/2016 - 05:03

విశాఖపట్నం, సెప్టెంబర్ 14: విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వచ్చి తీరుతుందని, విశాఖకు అన్యాయం జరిగే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. హోదాకు మించిన ప్యాకేజీ ఇచ్చారని, అందుకే అంగీకరించానన్నారు. కావేరి జలాల కోసం బెంగళూరు ఖ్యాతిని పాడు చేసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

09/15/2016 - 05:02

గుంటూరు, సెప్టెంబర్ 14: అల్పపీడనం కారణంగా రాష్ట్రం లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువన క్యాచ్‌మెంట్ ఏరియాతో పాటు శ్రీశైలం జలాశయం నుంచి అవుట్‌ఫ్లోగా 20వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయటంతో ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Pages