S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/17/2016 - 05:08

విజయవాడ, సెప్టెంబరు 16: ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపిసిఆర్‌డిఏ) పరిధిలో భవన నిర్మాణాలకు తక్షణ అనుమతులకోసం ఓపెన్ ఫోరంను శుక్రవారం ప్రారంభించారు. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య ఈ ఓపెన్ ఫోరం ద్వారా అనుమతులు జారీ చేస్తారు.

09/16/2016 - 17:59

ఏలూరు : ఈ నెల 22న ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆధ్వర్యంలో యువభేరి జరగనున్నట్లు కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం శుక్రవారం వెల్లడించారు. ప్రత్యేక హోదాను చంద్రబాబు నాయుడు ...బీజేపీ పెద్దలకు తాకట్టు పెట్టారన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ప్రధానికి చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పడం దారుణమన్నారు.

09/16/2016 - 17:18

విశాఖ : పదేళ్ల వరకు ఏపీలో విద్యుత్ కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని, విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా ఏపీ మారిందని ఏపీ ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ శుక్రవారం తెలిపారు. ఎల్‌ఈడీ బల్బుల వినియోగంలో ఏపీ మోడల్‌ స్టేట్‌గా మారిందని, మార్చి నాటికి విశాఖలో అండర్‌గ్రౌండ్‌ కేబుల్‌ వ్యవస్థ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. విభజననాటికి ఏపీలో 22.5 మిలియన్ల విద్యుత్‌లోటు ఉందని అజయ్‌జైన్‌ తెలిపారు.

09/16/2016 - 16:45

అనంతపురం: అనంతపురంలో డెంగ్యూతో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటనలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రామాంజనేయులును శుక్రవారం సస్పెన్షన్‌ చేశారు. నగరంలో పందుల సంచారాన్ని నిషేధించాలని అధికారులకు మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆదేశించారు. మంత్రి ఆదేశంతో కాలనీలలో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేశారు.

09/16/2016 - 16:19

చిత్తూరు: తనకు చదువుపై ఇష్టం లేదని, ఈ పరిస్థితుల్లో తాను బతకలేనని భావిస్తూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మదనపల్లెలో శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. చదువుపై దృష్టి పెట్టలేకపోతున్న సాగర్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది.

09/16/2016 - 15:43

తిరుపతి: భారతరత్న ఎం.ఎస్ సుబ్బలక్ష్మి తెలుగు, తమిళ, కన్నడ సహా పలు భాషల్లో భక్తిరస పాటలు అందించారని తితిదే అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. ఎమ్‌ఎస్‌ఆలపించిన శ్రీవారి సుప్రభాతం భక్తుల మనస్సు నుంచి చెరిగిపోదన్నారు. తిరుపతి ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో శుక్ర‌వారం నిర్వహించిన ఎం.ఎస్ సుబ్బలక్ష్మి శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.

09/16/2016 - 15:29

తిరుపతి: ఈవ్‌టీజింగ్‌ను అడ్డుకునేందుకు యత్నించిన యువకుడిని చంపేందుకు తిరుపతిలో ఆకతాయిలు శుక్రవారం ప్రయత్నించారు. తిలక్‌రోడ్డులో ఓంకార్‌రెడ్డిపై అదే ప్రాంతానికి చెందిన కొందరు యువకులు పెప్పర్ స్ప్రే చల్లి ఆపై రాడ్‌లు, కత్తులతో దాడి చేశారు. ఈవ్‌టీజింగ్‌ను అడ్డుకున్నందుకే ఓంకార్‌రెడ్డిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. రుయా ఆస్పత్రిలో ఓంకార్ చికిత్స పొందుతున్నాడు.

09/16/2016 - 15:15

తిరుపతి : పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారమిక్కడ విలేకర్లతో అన్నారు. 2018కి పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేస్తామని బాబు చెప్పడం దగాకోరుతనమే అన్నారు. రాజధాని నిర్మాణానికి వైఎస్ జగన్ అడ్డుకుంటున్నారని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.

09/16/2016 - 15:12

విజయవాడ : దసరా ఉత్సవాల నాటికి విజయవాడ కనక దుర్గమ్మకు హెటిరో గ్రూపు తరఫున బండి పార్థసారథిరెడ్డి అమ్మవారికి రూ.4 కోట్లతో స్వర్ణకవచం, కిరీటం, ముక్కుపుడక, బులాకీ, బంగారు చేతులు తయారు చేయిస్తున్నారు. ఆర్‌వీఆర్ అసోసియేట్స్ రూ. కోటితో ఆలయానికి బంగారు వాకిలి చేయిస్తున్నట్లు ఈవో తెలిపారు. అమెరికాలోని డల్లాస్ నగరంలో ఉంటున్న ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ అర్చన రూ. 50 లక్షలతో వజ్రాల నెక్లెస్ చేయించనున్నారు.

09/16/2016 - 15:01

తిరుపతి : అక్టోబర్‌ 3 నుంచి 11వ తేదీ వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు తితిదే ఈవో సాంబశివరావు శుక్రవారం తెలిపారు. అక్టోబర్‌ 3న స్వామివారికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అక్టోబర్‌ 7న రాత్రి 7.30గం.కు స్వామివారికి గరుడవాహన సేవ జరుగుతుంది. ఈ సేవను వీక్షించేందుకు 1.75లక్షల మంది వస్తారని అంచనా.

Pages