S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/17/2016 - 13:47

విజయవాడ: విజయవాడలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పర్యటనను వ్యతిరేకంగా వామపక్షాలు శనివారం ఆందోళనకు దిగాయి. వెంకయ్య గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. రామవరప్పాడు జంక్షన్‌లో వామపక్షాల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారుల, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పలువురు నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

09/17/2016 - 13:45

విశాఖ : తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో ప్రపంచ తీర ప్రాంత దినోత్సవం సందర్బంగా శనివారం ఉదయం విశాఖలో బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. చీఫ్ నావెల్ అడ్మిరల్, నావీ అధికారుల కుటుంబసభ్యులు, పోలీస్ కమిషనర్ యోగానంద్, జీవీఎంసీ కమిషనర్, విద్యార్థులు పాల్గొన్నారు.

09/17/2016 - 13:43

అనంతపురం: విషజ్వరాలతో జిల్లా వ్యాప్తంగా 12 మంది మృత్యువాత పడ్డారు. 144 మందికి డెంగ్యూ, 506 మందికి మలేరియా నిర్దారణ అయ్యింది. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని కలెక్టర్‌ శశిధర్ తెలిపారు.

09/17/2016 - 13:41

నల్గొండ: చిన్నకందుకూరును యాదాద్రి మండలంలో ఉంచాలని డిమాండ్‌ చేస్తూ వరంగల్‌-హైదరాబాద్‌ హైవేపై గ్రామస్తులు బైఠాయించి శనివారం ఆందోళనకు దిగారు. దాదాపు రెండు గంటలుగా ట్రాఫిక్‌జాం అయ్యింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. 20 మందిని అదుపులోకి తీసుకున్నారు.

09/17/2016 - 13:37

చిత్తూరు: శనివారం చిత్తూరు కార్పొరేషన్‌ సమావేశంలో సీకే బాబు వర్గ కార్పొరేటర్లు, టిడిపి కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. కార్పొరేటర్ల భర్తలను బయటకు పంపాలని మేయర్‌ ఆదేశించారు. అభివృద్ది పనులు జరగడం లేదంటూ కార్పొరేటర్‌ నిరసనకు దిగారు. సభను అరగంట మేయర్ వాయిదా వేశారు.

09/17/2016 - 12:44

విజయవాడ: ‘ 1972లో ఏపీని విభజించి ఉంటే ఆంధ్రప్రదేశ్‌ ముఖచిత్రమే మారేది... 2004 ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ చెప్పింది... 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఏమాత్రం పట్టించుకోలేదు. 2004లో కాంగ్రెస్‌ తీర్మానం చేశాక అన్ని పార్టీలు తెలంగాణ ఏర్పడాలని ఉత్తరాలు ఇచ్చాయి...’ అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.

09/17/2016 - 11:56

వెలగపూడి: అంటువ్యాధులు విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో సరైన చర్యలు తీసుకోవడానికి బదులు ఏవో కట్టుకథలు చెప్పి తప్పించుకోవాలని చూస్తే సహించేది లేదని ఎపి సిఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో అధికారులను హెచ్చరించారు. ఆయన శనివారం వివిధ శాఖల అధికారులతో టెలీకాన్ఫనెర్స్ నిర్వహించి, భారీ వర్షాల కారణంగా పారిశుద్ధ్యం అధ్వానంగా మారుతోందన్నారు. దీంతో అంటువ్యాధుల బారిన జనం పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.

09/17/2016 - 07:03

పెరవలి, సెప్టెంబర్ 16: కరణం పాత్రనే తన పేరుగా ఖ్యాతిగాంచిన ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి ‘్భబాగోతం’ నృత్య నాటికలోని కరణం పాత్రధారి ముత్యాల వెంకటేశ్వరరావు(66) శుక్రవారం మృతిచెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడుకు చెందిన వెంకటేశ్వరరావు గత కొద్దికాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు.

09/17/2016 - 07:07

అనంతపురం, సెప్టెంబర్ 16: అనంతపురం జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ రోగాలతో జనం విలవిల్లాడుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. తాజాగా అనంతపురం నగరానికి చెందిన ఇద్దరు చిన్నారులు డెంగ్యూతో మృతి చెందడంతో జిల్లా యంత్రాంగం కదిలింది.

09/17/2016 - 07:01

విశాఖపట్నం, సెప్టెంబర్ 16: విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింతగా పటిష్టపర్చడంలో భాగంగా వౌలిక సదుపాయాల అభివృద్ధికి రుణంగా రూ.2500 కోట్లు మంజూరు చేసేందుకు ప్రపంచ బ్యాంక్ అంగీకరించిందని రాష్ట్ర ఇంధన కార్యదర్శి అజయ్‌జైన్ పేర్కొన్నారు.

Pages