S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/19/2016 - 01:46

విశాఖపట్నం, సెప్టెంబర్ 18: అధ్యాపక నియామకాలకు సంబంధించి ఈ నెల 11న నిర్వహించిన ఎపిసెట్ (ఎపి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు) మూడు పేపర్ల కీలను ఈ నెల 20న వెబ్‌సైట్‌లో ఉంచుతున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 25 వరకూ డబ్ల్యుడబ్ల్యు డబ్ల్యు.ఎపిఎస్‌ఇటి.నెట్.ఇన్‌లో ఉంచుతున్నట్టు పేర్కొన్నారు.

09/19/2016 - 01:45

విజయవాడ, సెప్టెంబర్ 18: రాష్ట్రం పారిశ్రామిక విప్లవంతో నవపథంలోకి దూసుకెళ్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న అనేక పరిణామాలను ఆకళింపు చేసుకొని రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం బాటలు పరుస్తోంది. కేంద్ర ప్రభుత్వం విదేశీ కంపెనీలకు దేశంలో పరిశ్రమల ఏర్పాటుకు వంద శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతించిన దరిమిలా... కొత్త కొత్త కంపెనీలు పరిశ్రమల ఏర్పాటుకు దేశంలోకి వస్తున్నాయి.

09/18/2016 - 04:30

విశాఖపట్నం, సెప్టెంబర్ 17: అన్ని మతాల సిద్ధాంతం ఒకటేనని, సర్వధర్మ సమ భావనేనని, నిరుపేదలకు, నిస్సహాయులకు సేవ చేయడం ద్వారానే జన్మకు సార్ధకత లభిస్తుందని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పిజె కురియన్ అన్నారు. సినీ నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబుకు టిఎస్సార్ లలితకళా పీఠం తరపున ‘నవరస నట తిలకం’ బిరుదు ప్రదానం చేశారు. టిఎస్సార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో శనివారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది.

09/18/2016 - 04:21

విజయవాడ, సెప్టెంబర్ 17: ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక దృష్టి, ప్రత్యేక సాయంతో అభివృద్ధి చేసేందుకే ఇప్పటికి రెండు లక్షల 25 వేల కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీగా ప్రకటించిందని మున్ముందు కూడా అవకాశాలు, అవసరాలను బట్టి మరింత సాయం అందిస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచారశాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు.

09/18/2016 - 04:16

రేణిగుంట, సెప్టెంబర్ 17: హైదరాబాద్ - తిరుపతి స్పైస్ జెట్ విమానానికి శనివారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతున్న సమయంలో రన్‌వేను దాటి ముందుకు కెళ్లి ఇసుకలోకి కూరుకుపోయింది. దీంతో విమానంలో ఉన్న 72మంది ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. విమానం దిగువభాగం దెబ్బతిన్నా, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

09/18/2016 - 04:13

విజయవాడ, సెప్టెంబర్ 17:రాష్ట్రంలో అంటువ్యాధులు ప్రబలుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం తగదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊళ్లో ఎవరికి అంటువ్యాధులు సోకినా, ఇంట్లో వారికి సోకినట్టే భావించి రంగంలోకి దిగాలని, ఉదాసీన వైఖరిని విడనాడాలని ఆయన హితబోధ చేశారు.

09/17/2016 - 17:33

అనంతపురం : ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును బైక్‌ ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చిలమత్తూరు మండలం బీధిరెడ్డిపల్లి వద్ద శనివారం చోటుచేసుకున్న ఈ \ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

09/17/2016 - 15:10

హైద‌రాబాద్‌: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్రకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణ, రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.

09/17/2016 - 14:48

తిరుపతి : తుని ఘటనకు సంబంధించి ఈ నెల 19న విచారణకు రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 6,7 తేదీల్లో భూమనను సీఐడీ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపిన విషయం తెలిసిందే.

09/17/2016 - 14:29

వెలగపూడి : వెలగపూడి సచివాలయంలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు శనివారం శాసనసభ, మండలి భవనాల ప్లాన్‌పై సమీక్ష నిర్వహించారు. శాసనసభ ప్రాంగణం, భద్రతపై పోలీసులు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Pages