S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/17/2016 - 06:52

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 16: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయం విస్తరణకు ఎయిర్‌పోర్టు అధారిటీ శ్రీకారం చుట్టింది. రూ.181 కోట్ల నిధులతో చేపట్టే విస్తరణ పనులకు 19వ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేస్తారు.

09/17/2016 - 05:56

విశాఖపట్నం (జగదాంబ), సెప్టెంబర్ 16: ధ్యానం, జపం, స్తోత్రం ద్వారానే మానవుడు తేజోవంతుడవుతాడని ముక్కామల క్షేత్రం యజ్ఞపురదీశ్వరి పీఠాధీశ్వరులు పరమపూజ్య శ్రీ్ధర స్వామీజీ అన్నారు.

09/17/2016 - 05:40

గుంటూరు, సెప్టెంబర్ 16: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షక బలగాలు వెలగపూడి చేరుకున్నాయి. సచివాలయంలో ఏపిఎస్‌పిఎఫ్ దళాల భద్రతలో భాగంగా ఏపిఎస్‌పిఎఫ్ డిఐజి, ఇతర ఉన్నతాధికారులు లాంఛనంగా పూజలు నిర్వహించి కార్యాలయంలోకి ప్రవేశించారు. సుమారు వంద మంది వరకు సిబ్బందికి ప్రత్యేక బ్యారక్‌ను ఏర్పాటుచేశారు. ఇప్పటి వరకు సచివాలయ భద్రతా చర్యలను ఏపిఎస్‌పి బెటాలియన్ నిర్వహిస్తోంది.

09/17/2016 - 05:39

హైదరాబాద్, సెప్టెంబర్ 16: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశానికి వచ్చే ఏడాది నుండి ఆన్‌లైన్‌లోనే ప్రవేశపరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం నాడిక్కడ చెప్పారు.

09/17/2016 - 05:38

హైదరాబాద్, సెప్టెంబర్ 16: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటివరకూ కొనసాగుతున్న హోదా సెంటిమెంటు స్థానంలో ప్యాకేజీని జనంలోకి తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు స్వయంగా నడుంబిగించారు. ప్రజల హృదయంలో హోదా బలంగా నాటుకుపోయి, అదొక సెంటిమెంటుగా మారిన నేపథ్యంలో దానిని తొలగించే ప్రచారానికి బాబు శ్రీకారం చుట్టనున్నారు.

09/17/2016 - 05:37

విశాఖపట్నం, సెప్టెంబర్ 16: అనివార్యమైన పట్టణీకరణలో సౌకర్యవంతమైన, సుందర పట్టణాల నిర్మాణం ప్రభుత్వాలకు అతిపెద్ద సవాలుగా మారిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ అభిప్రాయపడ్డారు.

09/17/2016 - 05:36

హైదరాబాద్, సెప్టెంబర్ 16: తెలంగాణలో గ్యాంగ్‌స్టర్ నరుూమ్ ట్యాక్స్ వసూలు చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం లోకేష్ ట్యాక్స్ నడుస్తోందని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌ను సిఎంగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. రాజధాని, ప్రాజెక్టుల నిర్మాణాలకు తాము వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు.

09/17/2016 - 05:16

విజయవాడ, సెప్టెంబరు 16: రాష్ట్ర రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఫ్రాన్స్ ముందుకొచ్చింది. ఫ్రెంచ్ ఎంబసీలోని సస్టైనబుల్ డవలప్‌మెంట్ కౌనె్సలర్ ఫెన్నీ హెవర్, ఢిల్లీలోని ఫ్రెంచ్ డవలప్‌మెంట్ ఏజెన్సీ ప్రాజెక్ట్ ఆఫీసర్ హెర్వ్ డుబ్రోయ్ శుక్రవారం సిఆర్‌డిఏ కమిషనర్ శ్రీ్ధర్‌ను కలిశారు.

09/17/2016 - 05:14

విశాఖపట్నం, సెప్టెంబర్ 16:ఆర్థిక వృద్ధికి పట్టణ పునరుత్థాన ఆవశ్యకతను ఉద్ఘాటిస్తూ మూడు రోజుల బ్రిక్స్ దేశాల సదస్సు శుక్రవారంనాడిక్కడ ముగిసింది. ఆర్థిక అభివృద్ధి, ప్రజలకు సమస్యల్లేని జీవన సౌకర్యమే లక్ష్యంగా పట్టణ ప్రాంతాల ప్రణాళికల రూపకల్పన జరగాలని బ్రిక్స్ దేశాలు పిలుపునిచ్చాయి.

09/17/2016 - 05:12

విజయవాడ, సెప్టెంబరు 16: భారీ వర్షాల వలన పంట నష్టపోయిన ప్రాంతాల్లో వివరాల సేకరణ తక్షణమే ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని, వారికి కలిగిన నష్టాన్ని భర్తీ చేయాలని ఆయన ఆదేశించారు.

Pages