ఆంధ్రప్రదేశ్‌

ప్రతిష్ఠించిన చోటే గణపతి నిమజ్జనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 15: రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా డూండీ గణేష్ సేవా సమితి వరుసగా రెండోదఫా స్థానిక ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రాంగణంలో గతం కంటే 9 అడుగులు ఎత్తున మొత్తం 72 అడుగుల్లో ప్రతిష్ఠింపబడిన సిద్ది బుద్ది సమేత కైలాస మహాగణపతిని గురువారం రాత్రి ఎంతో కనుల పండువగా నిమజ్జనం జరిగింది. రంగు రంగుల విద్యుద్దీపాల కాంతులు, బాణాసంచాల పేలుళ్లు, మంగళ వాయిద్యాలు, ప్రత్యేక పూజల మధ్య రాత్రి 7.30 ప్రాంతంలో నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. విగ్రహాన్ని ఎటూ కదిలించకుండానే ఉన్నచోటనే నిమజ్జనం చేసే విధంగా విగ్రహం తయారీ సమయంలోనే ప్రత్యేక పైప్‌లైన్లను ఏర్పాటుచేయటం జరిగింది. ఎంతో అరుదుగా జరిగే ఇలాంటి నిమజ్జనం కార్యక్రమాన్ని కళ్లారా చూసేందుకు సాయంత్రం నుంచే వేలాదిమంది భక్తులు తరలిరావటం జరిగింది. అన్ని దారులు కళాశాల ప్రాంగణం వైపు దారితీశాయి. సమితి గౌరవాధ్యక్షుడు, స్థానిక శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు సారథ్యంలో ఏర్పాటైన పాలకవర్గం ఆధ్వర్యంలో ఉదయం నుంచే హోమాలు, ప్రత్యేక పూజలు, నవహారతులు జరుగుతూ వచ్చాయి. చివరగా క్షీరాభిషేకం చేయటం జరిగింది. ఒక్కసారిగా అన్ని పైప్‌లైన్లలో నుంచి నీరు వెదజల్లబడుతూ విగ్రహం లోలోపల నుంచే కరుగుతూ మట్టిని కరిగిస్తూ అర్ధరాత్రి సమయానికి పూర్తిగా నిమజ్జనం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇతర రంగులేమీ లేకుండానే 20 టన్నుల నల్లమట్టి, 28 టన్నుల ఐరన్, రెండు టన్నుల కొబ్బరిపీచు, రెండు టన్నుల గడ్డి, 20 అడుగుల పైప్‌లైన్లతో విగ్రహ నిర్మాణం జరిగింది. జూన్ 17న విగ్రహ నిర్మాణం ప్రారంభమైంది. ఒక్క విగ్రహం నిర్మాణానికే రూ.32 లక్షల ఖర్చయింది. మొత్తంపై కోటి రూపాయలకు పైగా వ్యయమైనట్లు నిర్వాహకులు చెబుతున్నారు. తాపేశ్వరం నుంచి తీసుకువచ్చిన 8,500 కిలోల లడ్డూను ప్రసాదంగా ఉంచటం జరిగింది. ఉదయం నుంచే భక్తులకు ప్రసాదం పంపిణీ జరిగింది. నిమజ్జనం అనంతరం కరిగిన మట్టిని తమ తమ ఇళ్లకు తీసుకెళ్లేందుకు భక్తులు తమ వెంట క్యారీబ్యాగ్‌లను తెచ్చుకోవటం జరిగింది. గత ఏడాది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నగరంలో ఉన్నప్పటికీ అటువైపు కనె్నత్తి చూడనప్పటికీ ఈదఫా ఈ భారీ వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయటం విశేషం.

మండపంలోనే గణేశుని నిమజ్జన దృశ్యం