ఆంధ్రప్రదేశ్‌

హోదా కోసం సామూహిక దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 15: ఆంధ్ర రాష్ట్రం బాగుపడడం ఇష్టం లేకనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజీలతో ప్రజల అభిష్టాన్ని కాలరాసిందని సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, సిపిఎం కార్యదర్శి కుమార్ రెడ్డి, వైఎస్సార్ సిపి తిరుపతి ఎంపి వరప్రసాద్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా ఆరోపించారు. ప్రత్యేక హోదాకోసం ఇటీవల జరిగిన బంద్‌లో అఖిలపక్ష నేతలను ప్రభుత్వం అరెస్టుచేసి పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాసిందని నిరసిస్తూ అఖిల పక్ష నేతల ఆధ్వర్యంలో గురువారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ఒక రోజు సామూహిక దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ హక్కులను కాలరాయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేర్పరన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు అధికార పార్టీకి కార్యకర్తల్లా వ్యవహరించారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో విజయం కోసం హోదాను అడ్డుపెట్టుకుని విజయంసాధించాక హోదా అవసరం లేదని,ప్యాకేజీయే బెటరని ఆంధ్రులను మోసగిస్తున్నారని కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఏరుదాటాక బోడి మల్లన్న సామెతను ప్రధాని మోదీ నిజం చేస్తున్నారని కాంగ్రెస్‌నేత శ్రీదేవి ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కొమరంపులిలా రా: రోజా
అఖిల పక్ష సమావేశంలో రోజామాట్లాడుతూ ఎన్టీఆర్, ఎంజిఆర్, జయలలితవంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని పూర్తిస్థాయి రాజకీయాల్లో కొమరంపులిలా రావాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు పిలుపునిచ్చారు. పవన్‌కు నిజంగా ప్రజలపై అభిమానం ఉంటే పూర్తిస్థాయి రాజకీయాల్లో వచ్చి హోదాకోసం తమతో కలిసి పోరాడాలన్నారు. నరుూమ్ ఎంత అరాచకాలు సృష్టించాడో అంతకు మించిన అరాచకాలను సిఎం సృష్టిస్తున్నారని విమర్శించారు.

తిరుపతిలో అఖిలపక్ష దీక్షలో మాట్లాడుతున్న నగరి ఎమ్మెల్యే రోజా