ఆంధ్రప్రదేశ్‌

డెంగ్యూపై భయం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 15: డెంగ్యూ జ్వరాల తీవ్రతను స్వయంగా తెలుసుకునేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలు వ్యాప్తిచెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇప్పటికే నమోదైన కేసులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్యసేవలపై స్వయంగా తెలుసుకునేందుకు ఇక్కడి రిమ్స్‌లో ఆయన అధికారులు, వైద్యులతో సమీక్ష నిర్వహించారు. డెంగ్యూ జ్వరం అంటూ జిల్లా ప్రజలను భయబ్రాంతులు చేస్తున్న ప్రైవేటు నర్సింగ్‌హోంలు, వాటిని నిర్వహిస్తున్న వైద్యులపై కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం, ప్రజాప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదులపై మంత్రి కామినేని తీవ్రంగా స్పందించారు. రోగులను భయబ్రాంతులకు గురిచేస్తూ ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గిపోయినట్లు రక్తపరీక్షల ద్వారా తప్పుడు నిర్థారణ చేస్తూ 50 నుంచి 70 వేల రూపాయల వరకూ రోగుల నుంచి వసూలు చేసే సరికొత్త వైద్య వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతానంటూ హెచ్చరించారు. డెంగ్యూ లేకుండానే ఉన్నట్లు ధ్రువీకరిస్తున్న ప్రైవేట్ నర్సింగ్‌హోంల లైసెన్స్‌లు రద్దు చేస్తామన్నారు. నిర్వాహకులు, వైద్యులను ప్రాక్టీస్ చేయకుండా బ్లాక్‌లిస్టులో పెడతామని హెచ్చరించారు. జిల్లాలో 23 మంది ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్నట్లు కలెక్టర్ సమాచారం ఇవ్వడంతో వారి కేస్‌షీట్లు రప్పించి, రక్తపరీక్షలు నిర్వహిస్తే వారంతా డెంగ్యూ జ్వరపీడితులుకాదంటూ తెలిసిందని కామనేని ఆవేదన వ్యక్తపరిచారు. అటువంటి వారిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ ప్రశ్నించారు. రాష్టమ్రంతటా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వచ్చే మూడు మాసాల్లో ప్రభుత్వ వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి సెలవులు ఇవ్వరాదంటూ జిల్లా ఉన్నతాధికారులను మంత్రి కామనేని ఆదేశించారు.