S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/30/2016 - 07:57

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు కావటం లేదని టిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఆరోపించారు. శుక్రవారం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై జరిగిన చర్చలో కేశవరావు పాల్గొన్నారు.

04/30/2016 - 07:57

హైదరాబాద్, ఏప్రిల్ 29: దేశంలోనే తెలంగాణ ధనిక రాష్టమ్రని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పలు సార్లు ప్రకటించినా, ఆరోగ్యశ్రీకి నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని టి.పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. దీంతో ఈ పథకం మూలన పడే ప్రమాదం ఉందని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి 300 కోట్లు బకాయి చెల్లించాల్సి ఉందన్నారు.

04/30/2016 - 07:55

హైదరాబాద్, ఏప్రిల్ 29: నీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పనులన్నింటినీ సమన్వయం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులకు సూచించారు. జిల్లాల వారిగా కలెక్టర్లు అధికార యంత్రాంగం అంతటినీ సమన్వయం చేయాలని చెప్పారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శుక్రవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

04/30/2016 - 07:40

ఖమ్మం, ఏప్రిల్ 29: కాంగ్రెస్ వ్యతిరేక విధానాల వల్ల ఏర్పడిన తెలుగుదేశం పార్టీ పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌తో పొత్తు కలవటంతో ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శుక్రవారం పాలేరు నియోజకవర్గ టిఆర్‌ఎస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ సందర్భంగా ఖమ్మంలో విలేఖరులతో మాట్లాడుతూ అనైతిక పొత్తులతో పార్టీలు వ్యవహరిస్తున్నాయన్నారు.

04/30/2016 - 07:36

ఖమ్మం, ఏప్రిల్ 29: టిఆర్‌ఎస్ ప్రజలను మోసం చేస్తూ ఇతర పార్టీల అభ్యర్థులను బెదిరింపులకు గురి చేస్తుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు ఆరోపించారు.

04/29/2016 - 18:16

హైదరాబాద్: పాతబస్తీలోని ఓ ప్రసూతి ఆస్పత్రిలో వైద్యురాలిపై శుక్రవారం కొందరు మహిళలు దాడి చేశారు. పిల్లలకు టీకాలు ఇప్పించేందుకు వచ్చిన మహిళల పట్ల ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఆగ్రహించిన మహిళలు వారితో వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో ఓ వైద్యురాలిపై కొందరు మహిళలు చేసుకున్నారు. సిబ్బంది ఫిర్యాదుపై పోలీసులు ఆస్పత్రికి చేరుకుని నిందితులను అరెస్టు చేశారు.

04/29/2016 - 18:14

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటూ సంస్థను లాభాల బాటలో నడిపిస్తానని టి.ఆర్టీసీ చైర్మన్‌గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన సోమారపు సత్యనారాయణ అన్నారు. ఆర్టీసీలో లోటుపాట్లను తెలుసుకుని, ఉద్యోగులు, ప్రయాణీకుల ఆకాంక్షల మేరకు అభివృద్ధి చేస్తానన్నారు.

04/29/2016 - 17:02

ఖమ్మం: పాలేరు ఉపఎన్నికలో గెలుపుకోసం సాక్షాత్తూ సిఎం కెసిఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, మంత్రులను ప్రచారానికి పంపుతున్నందున ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని టి.పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఇక్కడ మీడియాతో చెప్పారు. ప్రజాబలంతో పాటు రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబానికి ఉన్న ఆదరణతో పాలేరులో తమ అభ్యర్థి సుచరిత గెలవడం ఖాయమన్నారు.

04/29/2016 - 17:02

హైదరాబాద్: విద్యాసంస్థల్లో పోలీసుల చేత తనిఖీలు జరిపించరాదంటూ కోర్టును ఆశ్రయించిన ప్రైవేటు కళాశాలలకు మరో షాక్ తగిలింది. తనిఖీల్లో పోలీసులు పాల్గొనవచ్చని హైకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. తనిఖీలకు ఒక ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను మాత్రమే అనుమతిస్తున్నట్లు కోర్టు షరతులు విధించింది.

04/29/2016 - 17:01

మహబూబ్‌నగర్: పాలమూరు-రంగారెడ్డి సాగునీటి పథకాన్ని గడువులోగా పూర్తి చేసి రికార్డు సృష్టిస్తామని, ఈ ప్రాజెక్టును అడ్డుకునే పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని నీటిపారుదల శాఖా మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆయన శుక్రవారం పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడుతూ, దీన్ని అడ్డుకునేందుకు ఎపి సిఎం కేంద్రానికి పూటకో లేఖ రాస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

Pages