S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/30/2016 - 08:09

హైదరాబాద్, ఏప్రిల్ 29: భాగవతాన్ని తెలుగులో రచించిన బమ్మెర పోతన్న గ్రామమైన బమ్మెర, బసవ పురాణం వంటి ప్రసిద్ధ గ్రంధాలను రచించిన పాల్కురికి సోమనాథుడి గ్రామమైన పాలకుర్తి, వాల్మిడి గ్రామాలను కల్చరల్ టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి పర్చాలని నిర్ణయించినట్టు పర్యాటకశాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ తెలిపారు. ఈ మూడు గ్రామాలు కూడా వరంగల్ జిల్లాలోనే ఉన్నాయి.

04/30/2016 - 08:07

హైదరాబాద్, ఏప్రిల్ 29: సచివాలయంలో పదవీ బాధ్యతల స్వీకరణలతో శుక్రవారం సందడి నెలకొంది. మంత్రుల శాఖలలో ఇటీవల జరిగిన చేర్పులు, మార్పుల మేరకు కొత్తగా అప్పగించిన శాఖల బాధ్యతలను మంత్రులు చేపట్టారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్, సహకారశాఖ మంత్రిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి పదవీ బాధ్యతలను చేపట్టారు.

04/30/2016 - 08:07

హైదరాబాద్, ఏప్రిల్ 29: ఈ ఏడాది జూన్ వరకు దేవాదాయ శాఖ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. సికింద్రాబాద్ సీతాఫల్‌మండిలోని దత్తాత్రేయ నవగ్రహ ఆలయం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సివి నాగార్జునరెడ్డి ఈ మేరకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాల్సిందిగా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.

04/30/2016 - 08:06

హైదరాబాద్, ఏప్రిల్ 29: రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన లాకప్ డెత్‌పై జుడిషియల్ మెజిస్ట్రేట్‌చే విచారణ జరిపించాలని హైకోర్టు జస్టిస్ రామలింగేశ్వర రావు శుక్రవారం ఆదేశించారు. 2007లో మోమిన్‌పేట్ పోలీస్ స్టేషన్లో ఇబ్రహీం అనే వ్యక్తి లాకప్‌లో మృతి చెందాడు. ఈ మేరకు న్యాయ విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని కోరుతూ ఇబ్రహీం భార్య నజ్మా కోర్టును ఆశ్రయించింది.

04/30/2016 - 08:04

హైదరాబాద్, ఏప్రిల్ 29: ‘పాలేరు అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికల్లో మాకు పరోక్షంగా మద్దతు ఇచ్చారు సంతోషం...అలాగే ప్రచారమూ చేయండి..’ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీ అధినేతలను కోరనున్నది.

04/30/2016 - 08:04

హైదరాబాద్, ఏప్రిల్ 29: ప్రైవేటు విద్యాసంస్థల్లో తనిఖీలు విద్యాశాఖ అధికారులే చేపట్టాలి తప్ప పోలీసులతో కాదని టిపిసిసి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.టి.పాపిరెడ్డిని కోరింది. ఎంతోమందిని విద్యావంతులు చేసి ఉన్నత స్థానానికి పంపిన ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలను కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయవద్దని కోవద్దని కోరింది.

04/30/2016 - 08:03

హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణ ఆర్టీసిని లాభాల బాటలో నడిపించేందుకు శక్తి వంచన లేకుండా పని చేస్తానని ఆ సంస్థకు తొలి చైర్మన్‌గా నియమితులైన సోమారపు సత్యనారాయణ వెల్లడించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తనపై ఉంచి అప్పగించిన బాధ్యతను తూచా తప్పకుండా నిర్వహిస్తానని అన్నారు. శుక్రవారం నాడిక్కడ బస్‌భవన్‌లో టిఎస్‌ఆర్టీసి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

04/30/2016 - 08:02

హైదరాబాద్, ఏప్రిల్ 29: రాష్ట్రంలో వర్షాభావంతో నెలకొన్న కరువు పరిస్థితుల వల్ల అవసరమైన చోట పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్టు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. పాడి, మత్స్య, పశుసంవర్ధకశాఖల మంత్రిగా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన తర్వాత సంబంధిత శాఖల అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

04/30/2016 - 07:58

ధర్మపురి, ఏప్రిల్ 29: కరీంనగర్ జిల్లా ధర్మపురిలో మునె్నన్నడూ లేని విధంగా తాగునీటికి కలుగుతున్న ఇబ్బందులు వర్ణానాతీతంగా మారాయి. క్షేత్రాన్ని ఆనుకుని ప్రవహించే జీవనది గోదావరి కనీవినీ ఎరుగని రీతిలో ఎండిపోవడం, నీరు గణనీయంగా తగ్గడంతో స్థానికులు, ఇక్కడికి వచ్చే భక్తులు కష్టాలను అనుభవిస్తున్నారు.

04/30/2016 - 07:58

ఖమ్మం, ఏప్రిల్ 29: టిఆర్‌ఎస్ ప్రజలను మోసం చేస్తూ ఇతర పార్టీల అభ్యర్థులను బెదిరింపులకు గురి చేస్తుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు ఆరోపించారు.

Pages