తెలంగాణ

వేగం పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: నీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పనులన్నింటినీ సమన్వయం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులకు సూచించారు. జిల్లాల వారిగా కలెక్టర్లు అధికార యంత్రాంగం అంతటినీ సమన్వయం చేయాలని చెప్పారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శుక్రవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. మిషనరీ, కాంట్రాక్టర్లు, పరిస్థితిని అంచనా వేసి పనులు వేగంగా జరిగేట్టు చూడాలని, మానవ వనరులను సిద్ధం చేసుకోవాలని అన్నారు. కరువు పరిస్థితుల వల్ల పనులు మరింత వేగంగా చేయాలని, చెరువుల్లో నీరు లేదు కాబట్టి ఈ పరిస్థితిని ఉపయోగించుకుని పూడిక తీసివేసే పనులను వేగంగా చేయాలని చెప్పారు. మొదటి విడతలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ముగించుకుని రెండవ విడత పనులు వేగంగా ప్రారంభించాలని చెప్పారు. పనుల్లో ఎక్కడా ఆటంకాలు ఏర్పడకుండా ఆర్థిక శాఖ అనుమతుల విషయంలో నిబంధనలను సరళతరం చేసినట్టు తెలిపారు. ప్రతి చెరువు పనికీ ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదని మిషన్ కాకతీయ రెండవ దశకు సంబంధించి నిబంధనల్లో మార్పులు చేయాలని అన్నారు. రెండవ దశ కింద తొమ్మిది వేల చెరువుల పనులు చేపడుతున్నందున చాలా వేగంగా పనులు చేయాలని చెప్పారు.. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నీటి ప్రాజెక్టులు, రహదారులు తదితర పనులన్నీ ఒకేసారి జరుగుతున్నందున కలెక్టర్లు అన్ని కార్యక్రమాలను సమీక్షించాలని, సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. కాంట్రాక్టర్లు, మిషనరీ, అధికార యంత్రాంగం అందరినీ సమన్వయం చేయాలని అన్నారు. జిల్లాల వారిగా పరిస్థితి అంచనా వేయాలన్నారు. పనులు వేగంగా జరగడానికి అవసరం అయిన విధాన మార్పులు చేసేందుకు సిద్ధం కావాలని అన్నారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే వ్యవసాయ భూముల్లోంచి పోయే పైప్‌లైన్ల నిర్మాణం పూర్తి చేయాలని, వర్షాలు వస్తే సాధ్యపడదని అన్నారు. జిల్లాల వారిగా ఇన్‌టెక్ వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్, పంప్ హౌస్, పవర్ స్టేషన్స్, పైప్‌లైన్స్ నిర్మాణ పురోగతిని కలెక్టర్లు, ఆర్‌డబ్ల్యుయస్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. నిర్మాణాలకు కావలసిన ఇసుకను వర్షాలు రావడానికి ముందే తెప్పించుకుని పెట్టుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. పైప్‌లైన్ల నిర్మాణానికి అవసరమయ్యే అటవీ అనుమతుల్లో జాప్యం ఉండరాదని ముఖ్యమంత్రి ఆదేశించారు.