తెలంగాణ

ప్రైవేటు కళాశాలలకు హైకోర్టులో చుక్కెదురు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విద్యాసంస్థల్లో పోలీసుల చేత తనిఖీలు జరిపించరాదంటూ కోర్టును ఆశ్రయించిన ప్రైవేటు కళాశాలలకు మరో షాక్ తగిలింది. తనిఖీల్లో పోలీసులు పాల్గొనవచ్చని హైకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. తనిఖీలకు ఒక ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను మాత్రమే అనుమతిస్తున్నట్లు కోర్టు షరతులు విధించింది. మరోవైపు తనిఖీలను నిలిపివేసే ప్రసక్తిలేదంటూ సిఎం కెసిఆర్ తేల్చిచెప్పడంతో తమ తదుపరి కార్యాచరణను ఖరారు చేసేందుకు ప్రైవేటు విద్యాసంస్థల జెఎసి వ్యూహరచన చేస్తోంది. తనిఖీలను నిలిపివేసే వరకూ తాము ఆందోళన వీడేది లేదని, టెట్, ఎంసెట్ పరీక్షల నిర్వహణకు భవనాలను, సిబ్బందిని ఇచ్చే ప్రసక్తి లేదని జెఎసి నాయకులు స్పష్టం చేశారు. దీంతో టెట్, ఎంసెట్‌లను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ సర్కారు గురువారం రాత్రి ప్రకటించింది.