S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/27/2016 - 17:52

ఖమ్మం: మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో మాట్లాడిన తర్వాతే అతని మంత్రిత్వ శాఖలను మార్చినట్లు సిఎం కెసిఆర్ బుధవారం ఇక్కడ చెప్పారు. ప్రాధాన్యత లేని శాఖలతో తలసానిని అవమానించారని కొందరు చేస్తున్న విమర్శల్లో అర్థం లేదన్నారు. వాణిజ్యపన్నుల శాఖలో ప్రజలతో నేరుగా సంబంధాలుండవు గనుక పాడిపరిశ్రమను తలసానికి ఇచ్చామన్నారు.

04/27/2016 - 17:50

హైదరాబాద్: పాలేరు ఉపఎన్నిక సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పటికీ, మేడే రోజున ఉత్సవాలు జరిపేందుకు అనుమతివ్వాలని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ను బుధవారం కలిసి సిఐటియు నేతలు విజ్ఞప్తి చేశారు.

04/27/2016 - 14:37

హైదరాబాద్: తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నా రాష్ట్ర ప్రభుత్వం అలక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బుధవారం తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ధర్నాలు నిర్వహించింది. తహశీల్దార్, ఆర్‌డిఓ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేసి అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.

04/27/2016 - 14:37

హైదరాబాద్: తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడి సాగునీటికి,తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నా తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని పలువురు కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన సందర్భంగా తెలంగాణలో కరవు తీవ్రతను వారు వివరించారు. రైతులను ఆదుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు విజ్ఞప్తి చేశారు.

04/27/2016 - 14:35

నల్గొండ: కోదాడ బైపాస్ రోడ్డుపై బుధవారం లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు మరణించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

04/27/2016 - 12:32

ఆదిలాబాద్: బెజ్జూరు మండలం గూడెం వద్ద మంగళవారం రాత్రి మావోయిస్టులు ప్రవేశించి వంతెన నిర్మాణంలో పాల్గొంటున్న కూలీలను బెదిరించారు. నిర్మాణ స్థలం వద్ద పొక్లెయిన్, టిప్పర్, ట్రాక్టర్, ఇతర సామగ్రిని వారు తగులబెట్టి బీభత్సం సృష్టించారు. కూలీల నుంచి 25 సెల్‌ఫోన్లను పట్టుకుపోయారు. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం.

04/27/2016 - 12:31

ఖమ్మం: ఉద్యమ సమయంలో ఎన్ని అవరోధాలు, అవహేళనలు ఎదురైనా గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు ధీరులుగా నిలిచినందునే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సిఎం కెసిఆర్ అన్నారు. ఇక్కడ బుధవారం తెరాస ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తల కృషి వల్లే తెలంగాణ ప్రజలు ఇపుడు స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నారన్నారు.

04/27/2016 - 12:30

ఖమ్మం: తెరాస ప్లీనరీ సందర్భంగా బుధవారం ఇక్కడ ఆ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి తెలంగాణ సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేశారు. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

04/27/2016 - 12:29

హైదరాబాద్: ఎప్పుడూ ఉపఎన్నికలపైనే ఆసక్తి చూపించే సిఎం కెసిఆర్‌కు తెలంగాణలో కరవు పరిస్థితులు గుర్తుకురావని సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక విపక్ష ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించడం తప్ప మరో పనిలేదన్నారు. పాలేరు ఉపఎన్నికపై ఉన్న శ్రద్ధ రైతుల పట్ల కొంతయినా చూపితే కరవు నుంచి ఉపశమనం దక్కేదన్నారు.

04/27/2016 - 12:28

ఖమ్మం: తెరాస పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం ఇక్కడ ప్లీనరీ ప్రారంభమైంది. తెరాస అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సుమారు 4వేల మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రతినిధుల సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి 15 తీర్మానాలు ఆమోదిస్తారు. సాయంత్రం జరిగే బహిరంగ సభలో కెసిఆర్ ప్రసంగిస్తారు.

Pages